బొద్దింకల్లాగే ఉన్నరు.. సీజేపీ నిరసనకారులపై ఎంపీ కంగనా రనౌత్ ఫైర్
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వివాదంపై జంతర్ మంతర్వద్ద నిరసన తెలిపిన కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలపై బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిరసనలకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియోలు ‘వాంతులు తెప్పించేలా’ ఉన్నాయని, ఆందోళనకారులు తమలోని మురికిని, చెత్తను సమాజం ముందు ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. నిరసనకారుల తీరు, వాడుతున్న భాష అత్యంత అసభ్యంగా ఉందని మండిపడ్డారు. మిమ్మల్ని మీరే బొద్దింకలని పిలుచుకుంటూ, అలాగే ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ వీడియోలు చూసి తాను మనోవేదనకు గురయ్యానని, డిజిటల్ డిటాక్స్ కావాలని అన్నారు.