Select Location
All Locations
State
Region
City / District
టాలీవుడ్ యంగెస్ట్ ప్రొడ్యూసర్ నుంచి లూసీ మూవీ..

టాలీవుడ్ యంగెస్ట్ ప్రొడ్యూసర్ నుంచి లూసీ మూవీ..

చరణ్ రాజ్, శశాంక్ బాలు, ప్రశాంతి ఏడే, బల్వీర్ సింగ్, రంజిత్ నగెళ్లి ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘లూసీ’. మహదేవ్ చిరంజీవి దర్శకుడు. సైన్మా స్టూడియోస్ బ్యానర్‌‌‌‌పై రాఘవేంద్ర పూజారి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పూర్తయిందని మేకర్స్‌‌‌‌ తెలియజేశారు. ప్రస్తుతం ఎన్‌‌‌‌ఐటీ వరంగల్‌‌‌‌లో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న రాఘవేంద్ర పూజారి, టాలీవుడ్ యంగెస్ట్ ప్రొడ్యూసర్‌‌‌‌‌‌‌‌గా సత్తా చాటాలనుకుంటున్నారు.

సైకలాజికల్ థ్రిల్లర్‌‌‌‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులను సస్పెన్స్, థ్రిల్, ఊహించని మలుపులతో అలరించనుందని నిర్మాత రాఘవేంద్ర పూజారి తెలియజేశారు. చదువు కొనసాగిస్తూనే నిర్మాతగా వరుస సినిమాలకు ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడించారు. వియాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఆశిష్ పసుల, కిరణ్ పట్టేటి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.


V6 News 1 hour ago
Home Flash News