Select Location
All Locations
State
Region
City / District
Sircilla | సిరిసిల్ల శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో రద్దీ.. అభిషేకం కోసం గంటల తరబడి నిరీక్షించిన భక్తులు

Sircilla | సిరిసిల్ల శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో రద్దీ.. అభిషేకం కోసం గంటల తరబడి నిరీక్షించిన భక్తులు

Sircilla | మాస శివరాత్రి పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సిరిసిల్లలోని శివ నగర్‌లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు భారీగా ఉదయాన్నే చేరుకున్నారు.

Sircilla | రాజన్న సిరిసిల్ల, జూలై 13: మాస శివరాత్రి పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సిరిసిల్లలోని శివ నగర్‌లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు భారీగా ఉదయాన్నే చేరుకున్నారు. ఉదయం 5 గంటలకు ఆలయానికి వెళ్లిన భక్తులు.. అభిషేకం దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్‌లో ఉన్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. అభిషేకం కోసం ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు వేచి ఉండి అభిషేకం నిర్వహించారు. ఆలయ నిర్వాహకులపై భక్తులు అసహనం వ్యక్తం చేశారు. తమకు అనుకూలమైన వారిని వీఐపీ దర్శనాలు చేయించి, అభిషేకాలను నిర్వహించారు. వారిని చూసిన భక్తులు గంటల తరబడి వేచి ఉన్నామని తమకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆలయ నిర్వహణలో భక్తులకు సరైన వసతులు, సౌకర్యాలు , పర్యవేక్షణ లోపం లేకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.


Smacy News 2 days ago
Home Flash News