Select Location
All Locations
State
Region
City / District
ఇరాన్‌తో కాల్పుల విరమణ ముగిసిందన్న ట్రంప్.. మళ్లీ మెుదలైన క్రూడ్ ఆయిల్ కష్టాలు

ఇరాన్‌తో కాల్పుల విరమణ ముగిసిందన్న ట్రంప్.. మళ్లీ మెుదలైన క్రూడ్ ఆయిల్ కష్టాలు

ఇరాన్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇరాన్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం, అవగాహన ఒప్పందం ఇక ముగిసిపోయాయని ట్రంప్ తేల్చి చెప్పేశారు. ఇరాన్ నుంచి వచ్చే ఏ దాడికైనా అమెరికా గట్టిగా సమాధానం ఇస్తుందని హెచ్చరించారు. ఈ ప్రకటనతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి.

టర్కీ రాజధాని అంకారాలో జరిగిన నాటో సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ సైనిక లక్ష్యాలపై అమెరికా శక్తివంతమైన దాడులు చేసిందని తెలిపారు. వాణిజ్య నౌకలపై జరిగిన దాడులకు ప్రతిస్పందనగానే ఈ చర్యలు తీసుకున్నామన్నారు. ఇరాన్‌ను అణ్వాయుధాల నుంచి దూరంగా ఉంచడమే తమ ప్రధాన లక్ష్యమని మరోసారి స్పష్టం చేశారు.

ఇరాన్ నేతలు అబద్దాలకోరులని, మాటమీద నిలబడరంటూ ట్రంప్ ఫైర్ అయ్యారు. చీటర్స్, సిక్ పీపుల్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హార్మూజ్ జలసంధిలో మూడు ట్యాంకర్లపై ఇరాన్ దాడితో అమెరికా తిరిగి దాడులు స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దాదాపు 80 లక్ష్యాలపై యూఎస్ బాంబుల వర్షం కురిపించగా.. తగ్గేదే లే అన్నట్లుగా బహ్రెయిన్, కువైట్ లోని అమెరికా ఆర్మీ స్థావాలపై దాడులు స్టార్ట్ చేసి ఇరాన్. ఇదే క్రమంలో ఇరాన్ ఆయిల్ అమ్ముకునేందుకు గతంలో ఇచ్చిన వెసులుబాటును వెనక్కి తీసుకుంటూ ఆంక్షల ఉక్కుపాదం కిందకు తీసుకొచ్చింది ట్రంప్ సర్కార్.


V6 News 17 days ago
Home Flash News