Select Location
All Locations
State
Region
City / District
దక్షిణాఫ్రికాలో కాల్పులు..12 మంది మృతి

దక్షిణాఫ్రికాలో కాల్పులు..12 మంది మృతి

జోహన్నెస్‌‌బర్గ్: దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌‌బర్గ్‌‌లో దుండగుల కాల్పుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది గాయపడ్డారు. మంగళవారం అర్ధరాత్రి క్లీవ్‌‌ల్యాండ్ లోని ఓ మురికివాడలో ఈ ఘటన జరిగింది. కాల్పుల సమాచారం అందడంతో పోలీసులు స్పాట్‌‌కు చేరుకున్నారు. 9 మంది పురుషులు, ముగ్గురు మహిళలు మృతి చెందినట్లు గుర్తించారు. అయితే, కాల్పుల ఘటన వెనక కారణాలు ఇంకా వెల్లడికాలేదు.


V6 News 1 hour ago
Home Flash News