Select Location
All Locations
State
Region
City / District
Vastu Tips : ఈశాన్య వీధిపోటు మంచిదేనా..? పూజ గదిపైన బాత్ రూం ఉండొచ్చా..?

Vastu Tips : ఈశాన్య వీధిపోటు మంచిదేనా..? పూజ గదిపైన బాత్ రూం ఉండొచ్చా..?

ఇల్లు అయినా స్థలం అయినా.. అది వ్యాపారం అయినా సరే వాస్తు అనేది ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నది. వాస్తు శాస్త్రాన్ని ఫాలో అవుతున్నారు జనం. ఈ క్రమంలోనే వాస్తుకు సంబంధించిన ఎన్నో సందేహాలకు సమాధానంగానే ఈ వాస్తు సూచనలు. ప్రశ్న : కొత్తగా కట్టుకున్న ఇంటికి ఉత్తర ఈశాన్యంలో ఒక దర్వాజ, తూర్పు ఈశాన్యంలో ఒక దర్వాజ పక్కపక్కనే ఉన్నాయి. ఉత్తర ఈశాన్యం దర్వాజ ప్రధానమైంది. అయితే దానికి ఎదురుగా దూరంలో చిన్న వీధి ఉంది. దీని వలన వీధి పోటు సమస్య వస్తుందా..? సమాధానం : ఉత్తర ఈశాన్యం వైపు దర్వాజ ఉంటే వీధిపోటు అవుతుంది. అయితే ఇదేమీ దోషం కాదు. ఉత్తర ఈశాన్య వీధిపోటు మంచిందే. సత్ఫలితాలే ఉంటాయి. 

తూర్పు ఈశాన్యంలో వీధిపోటు ఉన్నా కూడా మంచిదే. ఎలాంటి సమస్యలు రావు. ప్రశ్న : పూజ గది ఉన్న స్థానానికి పైన మొదటి అంతస్తులో బాత్ రూమ్ ఉండొచ్చా? సమాధానం : గ్రౌండ్ ఫ్లోర్ లో పూజ గది ఉండి.. ఫస్ట్ ఫోర్ లో అదే చోట బాత్ రూమ్ ఉన్నా దోషం లేదు. రెండూ వేరువేరు గదులు. అయితే పూజ గది సరైన దిక్కులో ఉందో లేదో చూసుకోవాలి. ప్రశ్న : 12 సెంట్ల స్థలంలో తూర్పు ముఖంగా ఇల్లు కట్టుకున్నాం. ఇంటికి దక్షిణం దిక్కులో ఈ మధ్య ఆరు సెంట్ల స్థలం కొన్నాం. ఆ స్థలాన్ని పశువుల పెంపకానికి వాడుకోవచ్చా? సమాధానం : ఇంటికి దక్షిణ, పడమర దిక్కుల్లో స్థలాలు కొనకూడదు. అయితే.. దక్షిణ దిక్కు ఉన్న ఖాళీ స్థలంలో పశువుల కోసం పాకలాంటివి ఏర్పాటు చేసుకోవచ్చు.


V6 News 1 hour ago
Home Flash News