టోల్ ప్లాజాల్లో కొత్త రూల్.. అలాంటి వాహనాలకు ఫ్రీ పాస్ కట్ ? కేంద్రం కీలక నిర్ణయం !
జాతీయ రహదారులపై టోల్ ట్యాక్స్ మినహాయింపు ఉన్న వాహనాల లిస్టును తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోంది. ఇందులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారుల వాహనాలకు ఇకపై టోల్ మినహాయింపు కట్ చేసే అవకాశం కనిపిస్తుంది. టోల్ ఫీజు నిబంధనలను మార్చడం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖకు కొన్ని సిఫార్సులు చేసింది. మినహాయింపు ఉన్న వాహనాల వర్గాన్ని గ్రేడెడ్ పద్ధతిలో తగ్గించే ప్రతిపాదనపై ప్రస్తుతం అన్ని శాఖలతో చర్చలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. "సాధారణ ప్రజలకు ఇబ్బంది కలిగించే ఈ వీఐపీ సంస్కృతికి స్వస్తి పలకడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. అందుకే ఈ మార్పులను మొదట ప్రభుత్వ అధికారుల వాహనాల నుంచే ప్రారంభించాలని గట్టిగా అనుకుంటున్నారు" అని సంబంధిత అధికారి చెప్పారు.
ఫాస్ట్ ట్యాగ్ అన్యువల్ పాస్ ప్రతిపాదన ప్రభుత్వ ఉద్యోగుల కోసం 'ఫాస్ట్ ట్యాగ్ అన్యువల్ పాస్' కొనుగోలు చేసేలా ప్రోత్సహించాలని రోడ్డు రవాణా శాఖ అన్ని ప్రభుత్వ సంస్థలకు, రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఆఫీస్ పనులపై వెళ్లే అధికారులు ఈ పాస్ తీసుకుంటే, ఆ డబ్బును మొబైల్ ఫోన్ బిల్లులాగానే ప్రభుత్వం తిరిగి ఇచ్చేలా రీయింబర్స్ పద్ధతిని తీసుకురానున్నారు. ఈ విషయంపై డిఫెన్స్ తో కూడా చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎవరికి మినహాయింపు ప్రస్తుతం దేశంలో 25 రకాల ప్రభుత్వ పదవుల్లో ఉన్న ప్రముఖులు, వారి వెంట వచ్చే వాహనాలకు టోల్ ఫీజు నుండి మినహాయింపు ఉంది. వీటితో పాటు యూనిఫాంలో ఉండే డిఫెన్స్ సిబ్బంది, పారామిలటరీ దళాలు, కేంద్ర-రాష్ట్ర సాయుధ దళాలు, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లు, ఫైర్ ఇంజన్లు, హైవే ప్రాజెక్టులను చెక్ చేసే వాహనాలు, అంబులెన్స్‌లు, శవవాహనాలు వంటి అత్యవసర సేవల వాహనాలు ఉన్నాయి కారులో వెళ్తూ ట్రాఫిక్‌లో చిక్కుకున్న గర్భవతి..భార్య కోసం గవర్నర్ కాన్వాయ్ అడ్డగింత..
ప్రస్తుతం చట్టబద్ధంగా టోల్ మినహాయింపు ఉన్న ఈ వాహనాలకు నేషనల్ హైవేస్ అథారిటీ (NHAI) కింద పనిచేసే IHMCL సంస్థ 'ఎగ్జెంప్టెడ్ ఫాస్ట్ ట్యాగ్ లను ఇస్తుంది. టోల్ కట్టకపోయినా సరే, ఈ వాహనాలకు ఈ ప్రత్యేక ఫాస్ట్ ట్యాగ్ ఖచ్చితంగా ఉండాలి. కొత్తగా రాబోతున్న ఫాస్ట్ ట్యాగ్ అన్యువల్ పాస్‌ను ఎవరైనా ఆన్‌లైన్‌లో కొనోచ్చు. ఆ తర్వాత ఆ బిల్లును ఆఫీసులో సబ్మిట్ చేసి డబ్బులు తిరిగి పొందవచ్చు. ఈ అన్యువల్ పాస్ ధర రూ. 3,075. దీని ద్వారా ఒక వాహనం దేశవ్యాప్తంగా దాదాపు 200 టోల్ ప్లాజాల నుండి ప్రయాణించవచ్చు. అంటే ఒక టోల్ ప్లాజాలో దాదాపు రూ. 15 మాత్రమే ఖర్చవుతుంది. దీనిని ఏడాది మొత్తం ఎన్నిసార్లయినా రెన్యూవల్ చేసుకోవచ్చు.