Select Location
All Locations
State
Region
City / District
నేరుగా సమాధానం చెప్పలేరా వీళ్లు!

నేరుగా సమాధానం చెప్పలేరా వీళ్లు!

ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న అధ్వాన్న పరిస్థితులపై మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్‌ ఎంత మొత్తుకున్నా ఏం లాభం? జవాబు ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ పవన్‌, కీలక మంత్రి లోకేశ్‌లు ఎప్పటికప్పుడు ఆవు కథ వల్లెవేస్తూ ప్రజలను పదే పదే మభ్యపెట్టడమే పనిగా పెట్టుకుంటున్నారు. ప్రతిపక్ష నేతగా జగన్‌ లేవనెత్తిన అంశాలపై ఈ కూటమి నిర్దిష్ట, నిర్దుష్ట సమాధానం చెప్పలేకపోతోంది.

రాజధాని పేరుతో అమరావతిలో జరగుతున్న ధన దోపిడీపై జగన్‌ కొన్ని రోజుల క్రితం విస్పష్టమైన సమాచారం, గణాంకాలతో వివరించారు. ఇదే సందర్భంలో హత్యా రాజకీయాలు ఎవరివో బాబు అండ్‌ కో స్పష్టం చేయాలని ప్రశ్నించారు కూడా. పెట్రోలు, డీజిల్‌ ధరలపై వీరు గతంలో ఇచ్చిన హామీలు.. ప్రస్తుత పరిస్థితులను పోల్చి విమర్శించారు. ‘‘బోత్‌ ఆర్‌ నాట్‌ ద సేమ్‌’’ అంటూ లోకేశ్‌ చేసిన వ్యాఖ్యకు సమాధానమిస్తూ.. తమ ప్రభుత్వం, పాలన ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి అస్సలు పొంతనే లేదని స్పష్టం చేశారు... 

‘‘అవును.. బోత్‌ కేన్‌ నెవ్వర్‌ బీ ద సేమ్‌’’ అంటూ జగన్‌ చేసిన వ్యాఖ్య ఇప్పుడు సోషల్‌మీడియాలో హైలైట్‌గా నిలుస్తోంది. జగన్‌ అన్ని రకాల ఆధారాలతో చేసిన ఆరోపణలకు లోకేశ్‌, మంత్రి అచ్చెన్నాయుళ్లు ఇచ్చిన సమాధానం ఏమిటి? వ్యక్తిగతంగా జగన్‌ను విమర్శించడం. దూషణలకు దిగడం. తమ భుజాలు తామే చరచుకుని ‘‘శెభాష్‌’’ అనుకోవడం. అబద్ధాలకు రెక్కలు తొడిగి ప్రజల్లోకి తీసుకెళ్లడమే పనిగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారన్న జగన్‌ మాట అక్షరసత్యమవుతోంది. లోకేశ్‌ ఈ మధ్య తన ప్రసంగాల్లో జగన్‌పై కొన్ని విమర్శలు చేశారు.


Sakshi 59 minutes ago
Home Flash News