Select Location
All Locations
State
Region
City / District
ఇద్దరు భారతీయులకు హంటా వైరస్‌

ఇద్దరు భారతీయులకు హంటా వైరస్‌

న్యూఢిల్లీ: డచ్‌ నౌక ఎంవీ హొండియస్‌లో హంటా వైరస్‌ వ్యాప్తి ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురి చేస్తున్నది. నౌకలో సిబ్బందిగా ఉన్న ఇద్దరు భారతీయులకు ఈ వైరస్‌ వ్యాప్తి చెందింది. నౌకలో మొత్తం ఐదుగురికి ఈ వైరస్‌ వ్యాప్తి చెందిందని.. ఈ వైరస్‌ వల్ల ఇప్పటివరకు ముగ్గురు మరణించారని బీబీసీ పేర్కొన్నది.

ఈ నౌకలో 28 దేశాలకు చెందిన 150 మంది ప్రయాణికులు ఉన్నారు. మరోవైపు వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో నౌక ప్రయాణం సాగిన 12 దేశాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తం చేసింది. ‘ఇదొక ప్రమాదకర వైరస్‌. కానీ వైరస్‌ బారిన పడిన వ్యక్తి మాత్రమే దీని వల్ల అనారోగ్యం పాలవుతాడు’ అని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు.


Smacy News 21 days ago
Home Flash News