Select Location
All Locations
State
Region
City / District
ఎవరీ శ్రీనాథ్? నటుడి నుంచి ఎమ్మెల్యే వరకు.. విజయ్‌తో 34 ఏళ్ల బంధం!

ఎవరీ శ్రీనాథ్? నటుడి నుంచి ఎమ్మెల్యే వరకు.. విజయ్‌తో 34 ఏళ్ల బంధం!

తమిళనాడు ఎన్నికల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ బోణీ కొట్టింది. విజయ్ అత్యంత ఆప్తమిత్రుడు, నటుడు శ్రీనాథ్.. తూత్తుకుడి నియోజకవర్గం నుంచి భారీ విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణ అభ్యర్థిగా బరిలోకి దిగిన శ్రీనాథ్, ఏకంగా డీఎంకే మంత్రి గీతా జీవన్‌ను 30వేల ఓట్ల భారీ మెజారిటీతో ఓడించారు. టీవీకే పార్టీ తరపున గెలిచిన మొదటి అభ్యర్థిగా ఆయన చరిత్ర సృష్టించారు. ఎవరీ శ్రీనాథ్ ? శ్రీనాథ్ కేవలం ఒక నటుడే కాదు, విజయ్‌కు ప్రాణ స్నేహితుడు. వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం గురించి చెప్పాలంటే.. విజయ్, నటుడు సంజీవ్, శ్రీనాథ్.. 

వీరంతా కాలేజీ రోజుల నుంచే బెస్ట్ ఫ్రెండ్స్. విజయ్ హీరోగా పరిచయమైన మొదటి సినిమా 'నాలయ తీరప్' (1992) లో శ్రీనాథ్ నటించారు. అలాగే విజయ్ చివరి సినిమాగా ప్రచారం జరుగుతున్న 'దళపతి 69' (జన్ నాయకన్) లో కూడా ఆయన నటించడం విశేషం. సినిమా ప్రస్థానం: శ్రీనాథ్ కేవలం కామెడీ నటుడే కాదు, దర్శకుడు కూడా. సంతానం హీరోగా వచ్చిన సూపర్ హిట్ సినిమా 'వల్లవనుక్కు పుల్లుం ఆయుధం' సినిమాకు ఆయనే డైరెక్టర్. 12B, భీమా, ధామ్ ధూమ్ వంటి ఎన్నో సినిమాల్లో ఆయన నటించారు. రాజకీయ వ్యూహం ఫలించింది తూత్తుకుడిలో అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో విజయ్ మొదట కొంత ఆలోచించారు. 

కానీ చివరకు తన నమ్మకస్తుడైన స్నేహితుడు శ్రీనాథ్‌ను రంగంలోకి దింపారు. ఎన్నికల సమయంలో టీవీకే మాజీ నాయకురాలు అజిత పార్టీని వీడి డీఎంకేలో చేరినప్పుడు, విజయ్ ఓట్లు చీలిపోతాయని అందరూ అనుకున్నారు. విజయ్ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వరని చెబుతూ ఆమె డీఎంకేతో కలిసి పనిచేశారు. కానీ, శ్రీనాథ్ మాత్రం ప్రజల్లోకి వెళ్లి వారి మనసు గెలుచుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా మంత్రిపై 30 వేల ఓట్ల తేడాతో గెలిచి, విజయ్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. స్నేహితుడి గెలుపుతో విజయ్ రాజకీయ ప్రయాణం తమిళనాట ఘనంగా మొదలైందని అభిమానులు పండుగ చేసుకుంటున్నారు!


V6 News 1 hour ago
Home Flash News