Select Location
All Locations
State
Region
City / District
క్రెడిట్ కార్డ్ బిల్లు రూ.12 లక్షలు కట్టాడని పన్ను శాఖ నోటీసులు.. చివరికి కోర్టు ఏం చెప్పిందంటే?

క్రెడిట్ కార్డ్ బిల్లు రూ.12 లక్షలు కట్టాడని పన్ను శాఖ నోటీసులు.. చివరికి కోర్టు ఏం చెప్పిందంటే?

క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? షాపింగ్, డిన్నర్లు, వెకేషన్ల కోసం భారీగా స్వైప్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త. మీ క్రెడిట్ కార్డ్ ఖర్చులు ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ నిఘాలో ఉన్నాయని మర్చిపోకండి. భారీ స్థాయిలో క్రెడిట్ కార్డ్ పేమెంట్లు చేసే వారిని 'SFT' స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ద్వారా ట్యాక్స్ అధికారులు ట్రాక్ చేస్తున్నారు. అయితే క్రెడిట్ కార్డ్ బిల్లు కడితే అది మీ దాచిపెట్టిన ఆదాయం కిందకు వస్తుందా? దీనిపై ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన తాజా తీర్పు గురించి ప్రతి ఒక్క క్రెడిట్ కార్డ్ యూజర్ తప్పక తెలుసుకోవాల్సిందే.

కృష్ణ గోపాల్ సరాఫ్ అనే ఉద్యోగి తన క్రెడిట్ కార్డ్ ద్వారా ఒక ఏడాది రూ.4లక్షల 55వేలు, మరో ఏడాది రూ.7లక్షల 28 వేలు చెల్లింపులు చేశారు. ఆదాయపు పన్ను అధికారులు వీటిని గమనించి.. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో సరైన ఆధారాలు లేవనే కారణంతో ఆ మొత్తాన్ని సెక్షన్ 69C కింద 'అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఎక్స్‌పెండిచర్'గా భావిస్తూ అతడి ఆదాయానికి కలిపేశారు. అంటే దానిపై భారీగా పన్ను కట్టాలని నోటీసులు ఇచ్చారు.

ఈ కేసు ఢిల్లీలోని ఐటీ అప్పిలేట్ ట్రిబ్యునల్ ముందుకు వెళ్ళింది. ఫిబ్రవరి 2025లో వెలువడిన ఈ తీర్పులో ట్రిబ్యునల్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. ట్యాక్స్ అధికారులు SFT/AIR డేటా ఆధారంగా నోటీసులు ఇవ్వవచ్చు. కానీ కేవలం పేమెంట్ చేశారనే కారణంతో దాన్ని ఆదాయంగా భావించకూడదని పేర్కొంది. సదరు వ్యక్తి ఆ డబ్బు తన జీతం నుంచి, గతంలో దాచుకున్న నగదు నుంచి లేదా స్నేహితుల దగ్గర తీసుకున్న అప్పు నుంచి కట్టానని చెప్పారు. అధికారులు ఆ బ్యాంక్ స్టేట్‌మెంట్లను, ఆధారాలను సరిగ్గా పరిశీలించకుండా నేరుగా పన్ను వేయడం తప్పు అని ట్రిబ్యునల్ తేల్చింది. ఈ కేసును మళ్లీ మొదటి నుంచి విచారించి, ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించాలని అసెస్‌మెంట్ ఆఫీసర్‌కు కేసును తిరిగి పంపింది.


V6 News 1 hour ago
Home Flash News