క్షేత్రస్థాయి పర్యవేక్షణ చేయాలి : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
జనగామ అర్బన్, వెలుగు: ప్రజలు అపోహలకు లోను కాకుండా, సాధారణ అవసరాలకు మాత్రమే ఇంధనం కొనుగోలు చేయాలని, అధికారులు కూడా క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి నివేదికలు సమర్పించాలని జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. జిల్లాలో ఉన్న పెట్రోల్, డీజిల్ నిల్వల అంశంపై మంగళవారం సంబంధిత శాఖల అధికారులతో మినీ కాన్ఫరెన్స్ హాల్ లో కలెక్టర్ రివ్యూ నిర్వహించారు.
జిల్లాలోని అన్ని బంకుల్లో తహసీల్దార్, సివిల్ సప్లై, పోలీస్, లీగల్ మెట్రాలజీ శాఖల అధికారులు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి ఉన్న నిల్వలని పరిశీలించాలన్నారు. పెట్రోల్, డీజిల్ ఉన్నప్పటికీ స్టాక్ లేదని బోర్డు పెట్టిన బంక్ యజమానుల మీద చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా పెట్రోల్, డీజిల్ కొరత ఉంటే 1800 425 00 333 టోల్ ఫ్రీ నెంబర్ కి, రాష్ట్ర విపత్తుల హెల్ప్ లైన్ 1077 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. సమావేశంలో అడిషనల్కలెక్టర్ బెన్ షాలోమ్, అధికారులు, పెట్రోల్ బంక్ డీలర్లు పాల్గొన్నారు.