వేతన సవరణ దిశగా TGSRTC ముందడుగు..రంగంలోకి ప్రత్యేక కమిటీ!
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఉద్యోగుల వేతన సవరణ ప్రక్రియను వేగవంతం చేస్తూ యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. 2021 వేతన సవరణ (RPS) అమలు వల్ల సంస్థపై పడే ఆర్థిక భారాన్ని అంచనా వేయడంతో పాటు, కొత్త టైమ్ స్కేల్‌ను రూపొందించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో డిప్యూటీ CAO (SP&A, CE) కె.గీత, డిప్యూటీ CTM (IT) సమీరా అఫ్రీన్ మరియు డిప్యూటీ CPM (IR&W, TRG) వై.శిరీష సభ్యులుగా వ్యవహరిస్తారు.