Select Location
All Locations
State
Region
City / District
కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావుపై కేసుల కొట్టివేత

కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావుపై కేసుల కొట్టివేత

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పోరాటంలో భాగంగా నిర్వహించిన మిలియన్‌ మార్చ్‌ సందర్భంగా బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, నాయకులు కేటీఆర్‌, హరీశ్‌రావుపై నమోదు చేసిన కేసును హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో 2011 మార్చి 10న ట్యాంక్‌బండ్‌పై జరిగిన మిలియన్‌ మార్చ్‌ సందర్భంగా దాడి చేశారంటూ జర్నలిస్టులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదైంది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ కేసీఆర్‌ కేటీఆర్‌ హరీశ్‌రావు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని జస్టిస్‌ కే సుజన విచారణ చేపట్టి గురువారం తీర్పు వెలువరించారు.

కేసు దర్యాప్తు సందర్భంగా ఫిర్యాదుదారులు పిటిషనర్లను గుర్తించలేదని, అందువల్ల వానే అకడ ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు లేవని న్యాయవాది టీవీ రమణారావు వాదించారు. ఈ వాదనతో ఏకీభవించిన హైకోర్టు పిటిషనర్లపై ఉన్న కేసులను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.


Smacy News 1 hour ago
Home Flash News