Anna Hazare: పార్టీ సరైన మార్గంలో నడిస్తే.. ఎంపీలు పార్టీ వీడేవారు కాదు: అన్నాహజారే
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాఘవ్ చద్దాతో పాటు మరో ఆరు మంది రాజ్యసభ ఎంపీలు ఆ పార్టీని వీడిన విషయం తెలిసిందే. ఆప్‌కు గుడ్‌బై చెప్పిన ఆ ఎంపీలు బీజేపీలో చేరారు. అయితే ఈ నేపథ్యంలో సామాజిక కార్యకర్త హన్నా హజారా (Anna Hazare) మాట్లాడారు. ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ సరైన మార్గంలో పయనిస్తే, బహుశా రాఘవ్ చద్దాతో పాటు ఇతర ఎంపీలు కూడా పార్టీని వీడేవారు కాదు అని అన్నాహజారే అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికీ హక్కు ఉంటుందని, బహుశా ఆ ఎంపీలు ఏదైనా సమస్యను ఎదుర్కొని ఉంటారని, అందుకే వాళ్లు పార్టీ వీడినట్లు తెలుస్తోందన్నారు. మహారాష్ట్రలోని అహల్యనగర్ జిల్లాలో రిపోర్టర్లతో అన్నాహజారే మాట్లారు.
అన్నాహజారేతో కలిసి ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యనేత కేజ్రీవాల్ అవినీతి ఉద్యమం సాగించిన విషయం తెలిసిందే. ఆప్ రాజ్యసభ ఎంపీలు రాఘవ్ చద్దా, సందీప్ పఠాక్.. ఢిల్లీలో శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి.. ఆ పార్టీని వీడుతున్నట్లు వెల్లడించారు. ఆప్ రాజ్యసభ సభ్యుల్లో మూడో వంతు పార్టీని వీడుతున్నట్లు చద్దా తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీలో నాయకత్వ లోపం తలెత్తిందని, ఒకవేళ ఆ పార్టీ కనుక సరైన మార్గంలో పయనిస్తే, బహుశా వాళ్లు పార్టీని వదిలి వెళ్లేవారు కాదని అన్నాహజారే అన్నారు.