Select Location
All Locations
State
Region
City / District
కర్కశ కాంగ్రెస్‌కు కాలం చెప్పిన జవాబు!

కర్కశ కాంగ్రెస్‌కు కాలం చెప్పిన జవాబు!

ఒక చిన్న కథ. ‘ సింహాన్ని చూసి ఓ నక్క.. తాను కూడా ఆ సింహంలా ఎందుకు ఉండకూడదు.. అడవికి రాజు ఎందుకు కాకూడదు అని ఆలోచించసాగింది. ఆ సింహాన్ని అనుకరించడం మొదలు పెట్టింది. ఎంత చేసినా సింహం సింహమే, నక్క నక్కనే కదా. ఒక రోజు సింహం నీళ్లు తాగుతున్నది. దాన్ని అనుసరిస్తూ వెళ్లిన నక్క కూడా అదే సమయంలో నీళ్లు తాగుతూ ఉన్నది. నీకంటే నేనే గొప్ప అంటూ సింహాన్ని వెక్కిరిస్తూ ఉంటుంది. సింహం ఒక్క పంజాతో ఆ నక్కను అంతం చేస్తుంది. నక్క నేలను కరుచుకుని ప్రాణం వదులుతుంది. ఇందులో నీతి ఏంటంటే మన స్థాయి ఏంటి, మనం ఏమి చేయగలం, మన శక్తి ఏంటి అని గ్రహించి మన సమఉజ్జీతో మాత్రమే పోరాడాలి. అంతే కానీ నోరున్నది కదాని అడ్డగోలుగా అరిస్తే ఇలాంటి గతే పడుతుంది అని నీతి.

రాష్ట్రంలో ఓ ముఖ్యనేత పరిస్థితి ఇలాగే తయారైంది. రెండున్నరేండ్లుగా బూతులు, డంబాచారాలు పలుకుతూ తానే గొప్ప అనే విధంగా ఆయన వ్యవహారం సాగుతున్నది. కేసీఆర్‌ చేసిన పనులను చిన్నవిగా చూపుతూ, ఆయన కంటే తాను గొప్ప అని చెప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. పరిపాలనను పక్కనబెట్టి అదే పనిగా అబద్ధాలు చెప్తూ, కక్ష సాధింపులే పరమావధిగా రగిలిపోతున్నారు. కానీ అబద్ధాల పునాదుల మీద కట్టిన గోడలు ఎక్కువ రోజులు నిలువలేవు. ఇప్పటికే కాంగ్రెస్‌ అసత్య మాటల అసలు భాగోతం ప్రజలకు అర్థమైంది. తాజా గా ఘోష్‌ కమిషన్‌ రిపోర్ట్‌ చెత్తబుట్టలోకి చేరడంతో కాంగ్రెస్‌ పాలక పెద్దల నిజస్వరూపం మళ్లీ బయటపడింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్‌ చేసిన అభివృద్ధిపై కాంగ్రెస్‌ నేతలు అదే పనిగా అసత్య ప్రచారం చేశారు. ఆ ప్రచారాన్ని నమ్మిన కొందరు ప్రజలు మోసపోయారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలు పరిపాలనను పక్కనబెట్టి కేసీఆర్‌పై, బీఆర్‌ఎస్‌ పాలనలో చేసిన అభివృద్ధిపై నిందలు వేయడమే పనిగా పెట్టుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని పచ్చి అబద్ధాలు మాట్లాడారు.

కాలం గొప్పది.. ఎవరెన్ని అబద్ధాలు చెప్పినా కాలం కచ్చితంగా వాటికి సమాధానం చెప్తుంది. ఇది చాలా విషయాల్లో రుజువయింది. కాళేశ్వరం కూలిపోయిందని చెప్పే రేవంత్‌రెడ్డి.. ఇటీవల వాతావరణ శాస్త్రవేతలు ఎల్‌నినో ప్రభావంతో వర్షభావ పరిస్థితులు రానున్నాయని చెప్పడంతో మళ్లీ కాళేశ్వరం బాట పట్టారు. మేడిగడ్డ బరాజ్‌ వద్ద పిల్లర్లు రిపేర్లు చేస్తాం అంటూ చెప్పారు. మరి అసలు పనికిరాదు అని దుష్ప్రచారం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు ఎలా పనికొస్తుందో రేవంత్‌రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇన్నాళ్లూ కాళేశ్వరంపై సీఎం, కాంగ్రెస్‌ నేతలు చేసింది పచ్చి అబద్ధపు ప్రచారం అని ఒప్పుకున్నట్టే కదా! ప్రభుత్వం జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ ఏర్పాటు చేయగా ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదని హైకోర్టు తాజాగా తేల్చిచెప్పింది. అంటే కమిషన్‌ ఏర్పాటు వెనుక కుట్ర, విచారణ ఎంత దారుణంగా జరిగిందో, కాంగ్రెస్‌ కక్ష సాధింపు రాజకీయాలు ఎలా నడిచాయో అర్థం చేసుకోవచ్చు.రక్ష. జై తెలంగాణ.

ఇక ప్రభుత్వ పెద్దల హడావుడి అంతా ఇంతా కాదు. జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌ నోటీసుల మేరకు కేసీఆర్‌, హరీశ్‌రావు విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరవడం అంటేనే అవినీతికి నిదర్శనమని, వారిని అరెస్ట్‌ చేస్తారని కాంగ్రెస్‌ నేతలు చిల్లర ప్రచారం చేశారు. విచారణ సందర్భంగా లేనిపోని వివరాలను బయటకు వెల్లడించడం, మీడియాకు తప్పుడు లీకులు ఇచ్చినప్పుడే అందరికీ అనుమానాలు వచ్చాయి. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన తీర్పు సర్కార్‌కు చెంపపెట్టు లాంటిదే. జగిత్యాల సభ జరిగే సమయంలోనే రేవంత్‌రెడ్డి మేడిగడ్డ బరాజ్‌ను సందర్శించి, అనంతరం సభ పెట్టారు. కేసీఆర్‌ ప్రసంగించే సమయంలోనే తాను ప్రసంగించేలా ఏర్పాటు చేసుకున్నారు. రేవంత్‌రెడ్డి ఆలోచన తీరు చూస్తే చాలా చిల్లర వ్యవహారంగా కనిపిస్తున్నది. అతని ఆలోచనకు ప్రజలే తగిన బుద్ధి చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కేసీఆర్‌ సభకే అత్యంత ఆదరణ కనబర్చారు. అభిమానం అనేది అడుక్కుంటే రాదు, ప్రజలు ఆరాధిస్తే, ప్రజలకు సేవ చేస్తే వస్తుందనే విషయం రేవంత్‌రెడ్డి గ్రహించాలి. 

కేసీఆర్‌కు పోటీగా 100 సభలు పెట్టినా ఆయన స్థాయిని అందుకోవడం ఎవరికైనా అసాధ్యం. కాంగ్రెస్‌ పాలనలో రైతుబంధుకు రామ్‌ రామ్‌, దళిత బంధుకు జై భీమ్‌, 6 గ్యారంటీలు గోవిందా, తెలంగాణ సొమ్మును ఢిల్లీకి దారాదత్తం ఇంతకుమించి ఏమున్నది. నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని టోపీ పెట్టారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని నయవంచన చేశారు. మహాలక్ష్మి పథకం కింద రూ.2500 కూడా ఇవ్వకపోవడం, హైడ్రా పేరిట పేదల ఇండ్లు కూల్చడం ఎంత ఘోరం. గురుకులాల్లో విద్యార్థుల మరణాలు ఎంత విషాదం. ఇలా చెప్పుకుంటూపోతే రేవంత్‌రెడ్డి రెండున్నరేండ్ల పాలనలో తెలంగాణలో చేసిన విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇప్పుడు జనం గ్రహించారు. గ్యారెంటీలు, డిక్లరేషన్ల డొల్లతనం బయటపడింది. మళ్లీ ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు కేసీఆర్‌కు పట్టం కట్టేందుకు వేయి కండ్లతో ఎదురుచూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే నినాదం మారుమోగుతున్నది. ‘సైకో రేవంత్‌ పోవాలి.. కేసీఆర్‌ సార్‌ రావాలి’. కేసీఆర్‌ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ.


Smacy News 1 hour ago
Home Flash News