ఫిఫా ఫైనల్.. ఆ టికెట్ ధర ఒక్కోటి రూ.21 కోట్లు
ఇంటర్నెట్ డెస్క్: యూఎస్‌ఏ, కెనడా, మెక్సికోలో మరికొన్ని నెలల్లో జరగనున్న ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup) 2026 టోర్నమెంట్ కోసం అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. దీని టికెట్ల కోసం ఇప్పటికే 50 కోట్లకు పైగా అభ్యర్థనలు వచ్చాయని ఫిఫా తెలిపింది. తాజాగా ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు నాలుగు ప్రత్యేక సీట్ల టికెట్లను ఫిఫా రీసేల్ సైట్ సేల్‌కు పెట్టింది. అయితే ఆ టికెట్ల ధర ఒక్కోటి 2.3 మిలియన్ డాలర్లు (రూ.21 కోట్లు) ఉండటంతో నెటిజన్లు అవాక్కవుతున్నారు. జులై 19న న్యూజెర్సీ వేదికగా జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లో ఈ ప్రత్యేక సీట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఫిఫా వెల్లడించింది. గోల్ వెనుక భాగంలో ఉన్న లోయర్ డెక్‌లోని బ్లాక్-124, లైన్-45లో ఇవి ఉన్నాయి. వీటి నెంబర్లు 33 నుంచి 36 వరకు.
మరిన్ని ఇతర సీట్ల ధరలను కూడా ఫిఫా వెల్లడించింది. ఈ ప్రపంచ కప్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని క్రీడాభివృద్ధికి తన 211 సభ్య దేశాలలో తిరిగి పెట్టుబడిగా పెట్టనున్నట్లు తెలిపింది. అది అనుభవం నేర్పింది.. సీనియర్‌గా నా బాధ్యత: సంజు శాంసన్ ఫిఫా ప్రపంచ కప్-2026 మ్యాచ్‌లు జూన్ 11న మొదలై.. జులై 19న వరకు జరగనున్నాయి. 39 రోజుల పాటు జరిగే ఈ మెగా టోర్నీకి కెనడా, మెక్సికో, యూఎస్‌ఏ ఆతిథ్యం ఇస్తున్నాయి. ఫిఫా వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు 32 దేశాలే పాల్గొంటుండగా.. ఈసారి 48 దేశాలు పోటీపడబోతున్నాయి. మొత్తం మూడు దేశాల్లోని 16 వేదికల్లో 104 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. జులై 19న అమెరికాలోని న్యూజెర్సీలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. దీంతో ఫైనల్ మ్యాచ్ టికెట్ల కోసం భారీ పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో టాప్ కేటగిరీ టికెట్లను ఫిఫా ఇటీవల భారీగా పెంచింది. ఒక్కో టికెట్ ధరను 10,990 డాలర్లు (రూ.10.19 లక్షలు)గా నిర్ణయించింది.