Select Location
All Locations
State
Region
City / District
శ్రీవారికి విరాళంగా ఏడు బంగారు పతకాలు

శ్రీవారికి విరాళంగా ఏడు బంగారు పతకాలు

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి శుక్రవారం బెంగళూరుకు చెందిన మహదేవమ్మ అనే భక్తురాలు రూ.94.80 లక్షలు విలువైన 753 గ్రాములున్న ఏడు బంగారు పతకాలను విరాళంగా అందించారు. ఈ మేరకు దాత శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో తితిదే ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి బంగారు పతకాలను అందజేశారు. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.20 లక్షల విరాళం తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఎస్వీ ట్రస్టుకు రూ.20 లక్షల విరాళం అందింది. 

హైదరాబాద్‌కు చెందిన గీతిక సాయి అనే భక్తురాలు శుక్రవారం శ్రీవేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10,01,116 విరాళంగా అందించారు. అదేవిధంగా హైదరాబాద్‌కు చెందిన ఏసీఎస్ టెక్నాలజీస్ సంస్థ శ్రీ వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.10,01,116 విరాళంగా అందించింది. ఈ మేరకు దాతల తరఫున తితిదే బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు శ్రీవారి ఆలయంలోని రంగ నాయకుల మండపంలో ఈవో ముద్దాడ రవిచంద్రకు విరాళం డీడీలను అందజేశారు.


Eenadu Telugu 1 hour ago
Home Flash News