Select Location
All Locations
State
Region
City / District
కార్పొరేట్ జిహాద్ను అరికట్టాలి : గ్లోబల్ హిందూ హ్యూమన్ రైట్స్ కలెక్టివ్ చైర్మన్ మోనికా రెడ్డి

కార్పొరేట్ జిహాద్ను అరికట్టాలి : గ్లోబల్ హిందూ హ్యూమన్ రైట్స్ కలెక్టివ్ చైర్మన్ మోనికా రెడ్డి

పంజాగుట్ట, వెలుగు: మల్టీ నేషనల్ కంపెనీల్లో పని చేసే హిందూ మహిళా ఉద్యోగులపై జరుగుతున్న మతపరమైన వేధింపులను అరికట్టాలని గ్లోబల్ హిందూ హ్యూమన్ రైట్స్ కలెక్టివ్ చైర్మన్ మోనికా రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో హిందూ జనజాగృతి, వానర సేన నాయకులతో కలిసి ఆమె మాట్లాడారు. ‘కార్పొరేట్ జిహాద్’ పేరుతో ముస్లిమేతర మహిళలను వలలో వేసుకుని మత మార్పిడులు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

ఇటువంటి సంఘటనలు కేవలం ఒక టీసీఎస్ సంస్థకు సంబంధించినవే కావని, దేశవ్యాప్తంగా ‘లవ్ జిహాద్’, ‘కార్పొరేట్ జిహాద్’ ను విస్తరించేందుకు పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. బాధితులకు సరైన రక్షణ కల్పించడంలో కంపెనీలు విఫలమవుతున్నాయన్నారు. ఈ కుట్రలపై కేంద్ర హోంశాఖ, మానవ హక్కుల కమిషన్, మహిళా శిశు అభివృద్ధి శాఖలు తక్షణమే విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో చేతన్ గడ్డి, డాక్టర్ కశ్యప్ రెడ్డి, న్యాయవాది లక్ష్మీనారాయణ రావు తదితరులు పాల్గొన్నారు.


V6 News 2 hours ago
Home Flash News