Select Location
All Locations
State
Region
City / District
ఎగుమతులు ఢమాల్‌

ఎగుమతులు ఢమాల్‌

గల్ఫ్‌ దేశాలకు బంద్‌.. భారత్‌ నుంచి గల్ఫ్‌ దేశాలకు వివిధ రకాల వస్తూత్పత్తుల ఎగుమతులు జరుగుతాయి. అయితే యుద్ధంతో యూఏఈ, ఖతార్‌, కువైట్‌, ఒమన్‌, బహ్రెయిన్‌, సౌదీ అరేబియా దేశాలకు జరిగే ఆయా ఎగుమతులకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలోనే మార్చిలో మిడిల్‌ ఈస్ట్‌ రీజియన్‌కు భారతీయ ఎగుమతులు ఏకంగా 57.95 శాతం క్షీణించాయి. సాధారణంగా ప్రతి నెలా 6 బిలియన్‌ డాలర్లుగా ఉండే ఎగుమతులు.. ఈ మార్చిలో దాదాపు 2-2.5 బిలియన్‌ డాలర్లుగానే ఉన్నాయని రాజేశ్‌ అగర్వాల్‌ చెప్పారు. రత్నాలు, ఆభరణాలు, ఎలక్ట్రానిక్స్‌, ఇంజినీరింగ్‌, పెట్రోలియం ఉత్పత్తులు, బియ్యం ఎగుమతులు 3.5 బిలియన్‌ డాలర్ల మేర దెబ్బతిన్నాయని ఆయన వెల్లడించారు.

దిగుమతులపైనా ప్రభావం హొర్ముజ్‌ జలసంధిలో అవాంతరాలు.. దేశీయ దిగుమతుల్నీ ప్రభావితం చేశాయి. గత నెల మార్చిలో 6.51 శాతం క్షీణతతో 59.59 బిలియన్‌ డాలర్లుగానే ఉన్నాయి. నిరుడు మార్చిలో 63.75 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ఈ ఏడాది తగ్గిన ముడి చమురు, బంగారం దిగుమతులే కారణం. కాగా, ఈ మార్చిలో దేశీయ ఎగుమతుల కంటే దిగుమతులే ఎక్కువగా ఉండటంతో వాణిజ్య లోటు 20.67 బిలియన్‌ డాలర్లుగా ఉన్నది. ఇదిలావుంటే గత నెలలో గల్ఫ్‌ దేశాల నుంచి భారత్‌కు వచ్చిన దిగుమతులూ 51.64 శాతం పడిపోయినట్టు రాజేశ్‌ అగర్వాల్‌ వివరించారు.


Smacy News 1 day ago
Home Flash News