ఆషాఢం సేల్స్లా కాంగ్రెస్ హామీలు! : కేటీఆర్
మేడిపల్లి, వెలుగు: ‘‘అత్తకు నాలువేలు, కోడలికి రెండున్నర వేలు ఇస్తం..”అని ఎన్నకలప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఆషాఢం సేల్స్లా మారాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్అయ్యారు. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలు నీటి ముటలుగా మారాయని విమర్శించారు. బుధవారం మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో జరిగిన పార్టీ కార్యకర్తల మీటింగ్‌లో కేటీఆర్, మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి సమక్షంలో మాజీ కార్పొరేటర్ కౌడె పోచయ్య, విద్యా, సామాజిక వేత్త ఆకుల మధుకర్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
‘‘టైం అడిగితే ముగ్గురు మొగాళ్లు కలిసి మూడు నెలల్లో పిల్లలను కనలేరు”అంటూ సీఎం వెటకారం మాట్లాడుతున్నారని, ఇప్పుడు 30 నెలలవుతున్నా ఏ పురోగతి లేకపోవడాన్ని ఏమనాలని నిలదీశారు. గతంలో తల్లి బిడ్డ క్షేమం కోసం రూ.13 వేలతోపాటు కేసీఆర్ కిట్ ఇచ్చామని, ఇప్పుడు కాంగ్రెస్ఇచ్చేది సున్నా.. చేసేది వెటకారమని దుయ్యబట్టారు. హైదరాబాద్ అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికొదిలేసిందని విమర్శించారు. "నిజం చెప్పాలంటే హైదరాబాద్లో ఇప్పుడు ఇద్దరే ఫుల్ ఖుషీగా ఉన్నరు.. ఒకరు దొంగలు, ఇంకొకరు దోమలు. గల్లీ గల్లీలో దోమలు దండయాత్ర చేస్తున్నయ్’’ అని ఎద్దేవా చేశారు.