... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
నిప్పుతో చెలగాటం వద్దు: చైనాకు ట్రంప్ బిగ్ వార్నింగ్

నిప్పుతో చెలగాటం వద్దు: చైనాకు ట్రంప్ బిగ్ వార్నింగ్

వాషింగ్టన్: పశ్చిమాసియా యుద్ధం వేళ డ్రాగన్ కంట్రీ చైనాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బిగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌కు ఆయుధాలు పంపితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చైనాను హెచ్చరించారు. దాదాపు ఆరు వారాలుగా పశ్చిమాసియా భగ్గుమంటుంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‎పై దాడి చేయడం.. కౌంటర్‏గా ఇరాన్ ప్రతిదాడులు చేయడంతో మిడిల్ ఈస్ట్ రణరంగంగా మారింది.
ఈ తరుణంలో తమ మిత్రదేశమైన ఇరాన్‎కు ఆయుధాలు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అందిచేందుకు చైనా ప్రయత్నిస్తోందని అమెరికా ఇంటలిజెన్స్ వర్గాలను ఉటంకిస్తూ సీఎన్ఎన్ సంచలన కథనం ప్రచురించింది. త్వరలోనే ఆయుధాలు ఇరాన్ చేతికి అందే అవకాశం ఉందని పేర్కొంది. అయితే, నేరుగా చైనా ఆయుధాలు అందించకుండా.. 

మీడియేటర్ ద్వారా ఈ టాస్క్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేసినట్లు నివేదించింది. మిడిల్ ఈస్ట్‎లో శాంతి కోసం అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరుగుతోన్న వేళ ఇరాన్‎కు చైనా ఆయుధాల సప్లై వార్తలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై స్పందించిన ట్రంప్ చైనాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నిజంగానే ఇరాన్‎కు ఆయుధాలు, గగనతల రక్షణ వ్యవస్థ అందిస్తే చైనా పెద్ద సమస్యను ఎదుర్కొవాల్సి వస్తోందని బెదిరించారు.

Source : V6 News

2 hours ago

Home Flash News