... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
GHMC "గుంపు మేస్త్రీ" అవినీతికి అడ్డా..

GHMC "గుంపు మేస్త్రీ" అవినీతికి అడ్డా..రేవంత్‌ రెడ్డిపై కవిత సంచలన వ్యాఖ్యలు!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీని "గుంపు మేస్త్రీ అవినీతికి అడ్డా"గా మార్చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీహెచ్ఎంసీని "గుంపు మేస్త్రీ అవినీతికి అడ్డా"గా మార్చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నిబంధనల ప్రకారం రూ. 5 లక్షలు దాటిన పనులకు టెండర్లు పిలవాల్సి ఉన్నా, రూ. 1,148 కోట్ల కాంట్రాక్టులను తన అనుచరులకు నామినేషన్ పద్ధతిలో కట్టబెట్టారని ఆరోపించారు. హెచ్ఎండీఏ పరిధిలో రూ. 35 వేల కోట్ల విలువైన భూములను అమ్మేసినా హైదరాబాద్ అభివృద్ధికి పైసా ఖర్చు చేయలేదని, ఇప్పుడు మళ్ళీ తన అవినీతి కోసం "ఫ్యూచర్ సిటీ" పేరుతో హంగామా చేస్తున్నారని విమర్శించారు. 

హైడ్రా పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులను హడలెత్తిస్తూ.. చదరపు అడుగుకు రూ. 150 చొప్పున వసూళ్లకు పాల్పడుతున్నారని కవిత సంచలన ఆరోపణలు చేశారు. ఈ బ్లాక్ మెయిల్ దందాకు సంబంధించి తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, వెంటనే వీటిని ఆపకపోతే ఈడీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అటు స్కిల్డ్ లేబర్‌కు రూ. 23 వేల జీతం ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ. 13 వేలు మాత్రమే ఇచ్చి కార్మికుల పొట్ట కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓఆర్ఆర్ విచారణకు వేసిన సిట్ ఏమైందని ప్రశ్నించిన ఆమె, వెంటనే అక్రమ కాంట్రాక్టులను రద్దు చేసి పారదర్శక టెండర్లు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

Source : Smacy News

1 hour ago

Home Flash News