... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
తెగించేసిన ఇరాన్: అమెరికా యుద్ధ నౌక అబ్రహం లింకన్ పైకి మిస్సైల్ బాంబులు

తెగించేసిన ఇరాన్: అమెరికా యుద్ధ నౌక అబ్రహం లింకన్ పైకి మిస్సైల్ బాంబులు

చర్చలు అంటూ ట్రంప్ శాంతి సందేశం పంపించాడు.. కండీషన్స్ అంటూ యుద్ధానికి ముగింపు దిశగా అడుగులు వేస్తున్నారు.. ఇంత జరుగుతున్నా.. ఇరాన్ మాత్రం తగ్గేదేలా అంటోంది. అమెరికాను నమ్మం.. ట్రంప్ ను అస్సలు పట్టించుకోం అంటూ తెగించేసింది. ఏ రేంజ్ లో అంటే.. అమెరికా యుద్ధ వాహన నౌక అబ్రహం లింకన్ ను టార్గెట్ చేసింది ఇరాన్.

2026, మార్చి 25వ తేదీ మధ్యాహ్న సమయంలో అమెరికా యుద్ధ నౌక అబ్రహం లింకన్ పైకి క్రూయిజ్ క్షిపణిలను ప్రయోగించాం అంటూ ఇరాన్ అధికారిక టెలివిజన్ ప్రకటించింది. ఇరాన్ ప్రయోగించిన క్రూయిజ్ క్షిపణిలు టార్గెట్ రీచ్ అయ్యాయా లేదా అనేది ఇరాన్ ప్రకటించలేదు.

ఇరాన్ చెప్పినదానికి అమెరికా అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అబ్రహం లింకన్ యుద్ధ నౌకపై దాడి జరిగిందా లేదా అనే విషయంపై మాట్లాడటం లేదు అమెరికా. అమెరికా యుద్ధ నౌక అబ్రహం లింకన్ పై నిఘా పెట్టామని.. ఇరాన్ సముద్ర జలాల్లోకి వస్తే దాడి చేస్తామని.. మా టార్గెట్ పరిధిలోనే ఉందని ఇరాన్ హెచ్చరించిన గంటలోనే.. క్రూయిజ్ క్షిపణిలను ప్రయోగించినట్లు వెల్లడించటం సంచలనంగా మారింది.

ఓ వైపు ఇరాన్ దేశంతో చర్చలు నడుస్తున్నాయని.. యుద్ధం ముగింపు దిశగా వెళుతుందని ట్రంప్ చెబుతూనే ఉన్నారు. ఇరాన్ మాత్రం ఇవేమీ పట్టించుకోవటం లేదు. ఇజ్రాయెల్ దేశం నుంచి దాడులు తీవ్రంగా ఉంటున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాతోపాటు చుట్టూ ఉన్న నాలుగు దేశాలు అయిన బెహ్రయిన్, ఖతార్, సౌదీ, జోర్దాన్ దేశాలు లక్ష్యంతో ఇరాన్ దాడులను మరింత పెంచింది.

అమెరికాను హెచ్చరించినట్లుగానే.. అబ్రహం లింకన్ యుద్ధ నౌకపై మిస్సైల్స్ ప్రయోగించినట్లు అధికారికంగా ప్రకటించటం ఇప్పుడు ప్రపంచ దేశాలను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. యుద్ధం తీవ్రత తగ్గకపోగా రోజురోజుకు పెరుగుతుండటంతోపాటు ఇరాన్ దేశానికి టర్కీ మద్దతు ఇవ్వటం ఇప్పుడు మరో ట్విస్ట్..

Source : V6 News

2 hours ago

Home Flash News