హైదరాబాద్లో గంజాయి బ్యాచ్ వీరంగం.. స్థానికులపై కత్తులతో దాడి.. ఇంటిపై పెట్రోల్ పోసి..
మా ఇంటి ముందు తాగవద్దు అన్న పాపానికి గంజాయి బ్యాచ్ సృష్టించిన వీరంగం.. స్థానికుల ప్రాణాల మీదకు వచ్చింది. మాకే చెప్తావా అంటూ ఇంటిపై దాడి చేయడమే కాకుండా కత్తితో పొడిచి.. నానా హంగామా చేసి పారిపోయారు దుండగులు. హైదరాబాద్ అత్తాపూర్ లో జరిగిన ఈ ఘటన స్థానికులను తీవ్రభయాందోళనల్లో ముంచేసింది.
అత్తాపూర్ లో సోమవారం (మార్చి 23) గంజాయి బ్యాచ్ వీరంగం చేసింది. గంజాయి మత్తులో యువకులు స్థానికుల పై దాడికి దిగారు. మా ఇంటి వద్ద
గంజాయి మత్తులో ఇంటిపై దాడి చేస్తుండటంతో.. అడ్డుకున్న యువకుడిని కత్తితో పొడిచారు. కత్తి బలంగా గుచ్చుకోవడంతో విరిగిపోయి వీపులోనే ఉండిపోయింది. దీంతో యువకుడు నరకయాతన అనుభవించాడు. అంతటితో ఆగకుండా పెట్రోల్ పోసి డోర్లు అంటించారు దుండగులు.
స్థానికులు ఎక్కువ సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకోవడంతో పారిపోయారు. అత్తాపూర్ అంతా కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. ఘటన స్థలానికి చేరుకున్న అత్తాపూర్ సీఐ.. బాధితుల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.