Commercial Cylinder Supply : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కమర్షియల్ గ్యాస్ కనెక్షన్ ఉన్న వారికి భారీ ఊరట.. వారందరికీ 5 కేజీల సిలిండర్లు ఫ్రీ
Commercial Cylinder Supply : ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం, గల్ఫ్ దేశాలపై ఇరాన్ వరుస దాడులు.. ప్రపంచ దేశాల మీద చాలా వరకు ప్రభావం చూపుతున్నాయి. మరీ ముఖ్యంగా మన దేశంలో గ్యాస్ సరఫరా మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలో గ్యాస్ బండ దొరక్క ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మరీ ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు వంటి వాటిని మూసి వేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
వాణిజ్య సిలిండర్లను ఎక్కువగా పంపిణీ చేయడంపై దృష్టి సారించింది. అందులో భాగంగా రాష్ట్రాలకు అదనంగా 20 శాతం కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను కేటాయించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మార్చి 23, సోమవారం నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో కూడా నేడు ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. ఏపీలో దాదాపుగా 12 లక్షల పైగా కమర్షియల్ గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్రం ప్రకటించిన 20 శాతం అదనపు కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లకి గ్యాస్ సిలిండర్ల పంపిణీ ప్రారంభం కానుంది. అంటే రాష్ట్రంలో ఈ రెండు మూడు రోజుల్లో దాదాపుగా రెండున్నర లక్షల కమర్షియల్ సిలిండర్లను గ్యాస్ కంపెనీలు డెలివరీ చేయనున్నాయి.