మెస్సీ అరుదైన రికార్డు.. 900 గోల్స్ సాధించిన రెండో ప్లేయర్
ఫోర్ట్ లాడర్‌డేల్ (అమెరికా): అర్జెంటీనా, ఇంటర్ మయామి స్టార్‌ఫుట్‌బాలర్ లియోనల్ మెస్సీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. తన కెరీర్‌లో 900 గోల్స్ సాధించిన రెండో ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. క్రిస్టియానో రొనాల్డో ముందున్నాడు. కాన్కాకాఫ్ చాంపియన్‌షిప్ కప్‌లో భాగంగా బుధవారం రాత్రి నాష్‌విల్లేతో జరిగిన మ్యాచ్‌లో ఇంటర్ మయామి తరఫున బరిలోకి దిగిన మెస్సీ ఏడో నిమిషంలో గోల్ కొట్టి ఈ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.
రెండుసార్లు మేజర్ లీగ్ సాకర్ ఎంవీపీ, ఎనిమిదిసార్లు బ్యాలన్ డి ఓర్ విన్నర్, వరల్డ్ కప్ చాంపియన్ అయిన మెస్సీ అన్ని గోల్స్ మాదిరిగానే ఈ గోల్‌ను కూడా తన ఎడమ కాలితోనే సాధించడం విశేషం. ఈ మైలురాయిని చేరడానికి మెస్సీ కంటే రొనాల్డోకు సుమార్ వంద మ్యాచ్‌లు ఎక్కువ ఆడాల్సి వచ్చింది.
అలాగే సెప్టెంబర్ 2024లో రొనాల్డో 900 గోల్స్ సాధించినప్పుడు అతని వయసు 39 ఏళ్లు. కానీ మెస్సీకి ప్రస్తుతం 38 ఏళ్లే. దాంతో అత్యంత వేగంగా ఈ రికార్డును సృష్టించిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు. 900 గోల్స్‌లో మెస్సీ.. బార్సిలోనా తరఫున 672, పారిస్ సెయింట్ జర్మన్ తరఫున 32, ఇంటర్ మయామి తరఫున 81, అర్జెంటీనా తరఫున 115 గోల్స్ కొట్టాడు. బ్రెజిల్ లెజెండ్ పీలే తన కెరీర్‌లో వెయ్యి గోల్స్ చేశారని కొందరు సూచిస్తున్నా.. అధికారిక లెక్కల ప్రకారం 800ల వరకే ఉన్నాయి.