... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
డ్రగ్స్‌ కేసు.. సిట్‌ అంటేనే కూర్చోవడం: బీజేపీ సెటైర్లు

డ్రగ్స్‌ కేసు.. సిట్‌ అంటేనే కూర్చోవడం: బీజేపీ సెటైర్లు

సాక్షి, నల్లగొండ: తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో సిట్ వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. సిట్ అంటేనే కూర్చోవడం అంటూ ఎద్దేవా చేశారు. నాయకులే డ్రగ్స్ పార్టీలో పాల్గొనడం బాధాకరం అని వ్యాఖ్యానించారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తాజాగా సాక్షితో మాట్లాడుతూ..‘తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలిస్తామని రేవంత్ చెప్పినవన్నీ ఉత్త మాటలే అలా జరిగితే.. ఫాంహౌస్‌కు డ్రగ్స్ ఎలా వచ్చాయి. నాయకులే డ్రగ్స్ పార్టీలో పాల్గొనడం బాధాకరం. స్కూలు పిల్లలకు కూడా డ్రగ్స్ సరఫరా అవుతోంది. డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో సిట్ వల్ల ఒరిగేదేమీ లేదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జరిగిందో ఇక్కడా అదే జరుగుతుంది. సిట్‌తో జరిగేదేమీ ఉండదు. డ్రగ్స్, ల్యాండ్, లిక్కర్ దందాలన్నీ కాంగ్రెస్ కనుసన్నల్లో సాగుతోంది

ఆర్ఎస్ఎస్ ని నిషేధించాలని కాంగ్రెస్ అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. భారత నిఘా విభాగం ‘రా’ను కూడా నిషేధించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. చండూరులో కాంగ్రెస్ దుండగులు బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నం చేశారు. ఆస్పత్రిలో చికిత్స అందించకుండా కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తీసుకొచ్చారు‌. తెలంగాణలో దారుణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. నల్లగొండలో ప్రజాస్వామ్యం లేదు. రాచరిక పాలన కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిపై పోలీసులు చేయి చేసుకున్నారు.

పెద్దపల్లి, మంచిర్యాలలో పోలీసుల బలంతో బీజేపీని అణిచివేసే ప్రయత్నం జరుగుతోంది. బీజేపీ కార్యకర్తలపై హత్యాయత్నం చేస్తే ఓ చిన్న కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ నాయకులు స్వార్థం కోసమే పోలీస్ వ్యవస్థను వాడుకుంటున్నారు. తెలంగాణలో గూండా రాజ్యం నడుస్తోంది. బీజేపీ కార్యకర్తలపై దాడి చేస్తే తిరగబడతాం అని హెచ్చరించారు. అలాగే, తెలంగాణలో కరెంట్‌ కోతలు విపరీతంగా ఉన్నాయి. కరెంట్‌ సరఫరా పూర్తి స్థాయిలో కొనసాగించాలి. పంటలు కూడా ఎండిపోతున్నాయి అని వ్యాఖ్యలు చేశారు.

Source : Sakshi

2 hours ago

Home Flash News