పాల్వంచలో కొనసాగుతున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు
పాల్వంచ, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ శ్రీనివాసగిరి పై అలివేలుమంగా పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కనుల పండువగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం సుప్రభాత సేవ, చతుస్థానార్చన, మహా పూర్ణాహుతి, ధ్వజావరోహణం, చక్రస్నానం, వసంతోత్సవం, సంప్రోక్షణ, మహదాశీర్వచనం తదితర పూజలు నిర్వహించారు.
వనపర్తికి చెందిన సౌమిత్రి రామాచార్యులు, హరిచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. పాదాల మండపం వద్ద చతుస్థానం, అగ్ని ముఖం నిత్య పూర్ణాహుతి, సహస్రదీపాలం కరణ, ఊంజల్ సేవ, దర్బార్ సేవ పవళింపు తదితర సేవలను నిర్వ హించారు. పూజల్లో శ్రీనివాసగిరి సేవా ట్రస్ట్ అధ్యక్ష, కార్యదర్శులు కొత్త వెంకటేశ్వర్లు, ఆరుట్ల లక్ష్మనాచార్యులు, భక్త సమాజ మండలి అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.