... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
ఆప్ఘనిస్తాన్పై బాంబులేసిన పాకిస్తాన్.. కాబూల్లో 400 మంది మృతి

ఆప్ఘనిస్తాన్పై బాంబులేసిన పాకిస్తాన్.. కాబూల్లో 400 మంది మృతి

కాబూల్: ఆప్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ఆప్ఘనిస్తాన్ రాజధాని నగరం కాబూల్పై పాకిస్తాన్ వైమానిక దాడులకు పాల్పడిందని ఆప్ఘనిస్తాన్ ప్రభుత్వ డిప్యూటీ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రాట్ తెలిపారు.

కాబూల్లోని 2 వేల పడకల హాస్పిటల్ పై పాకిస్తాన్ చేసిన ఈ వైమానిక దాడుల్లో 4 వందల మంది వరకూ చనిపోయారని ఆప్ఘనిస్తాన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దాదాపు 250 మంది గాయపడినట్లు పేర్కొన్నాయి. సోమవారం రాత్రి 8:50 గంటల సమయంలో కాబూల్ వ్యాప్తంగా పెద్ద పేలుడు శబ్దాలు వినిపించాయని.. ఆ తర్వాత విమాన శబ్దాలు వినిపించాయని స్థానికులు చెప్పారు. అయితే.. పాకిస్తాన్ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది.

తూర్పు ఆప్ఘనిస్తాన్ హాస్పిటల్ను గానీ, మరే ఇతర నివాస ప్రాంతాలను గానీ తాము టార్గెట్ చేయలేదని పాకిస్తాన్ చెప్పుకొచ్చింది. ఆప్ఘన్ సైనిక స్థావరాలను మాత్రమే టార్గెట్ చేశామని ఇస్లామాబాద్ చెప్పడం గమనార్హం. అయితే.. కాబూల్ హాస్పిటల్ ప్రమాద దృశ్యాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ కావడం గమనార్హం.

ఆసుపత్రి దగ్గరలో ఎటువంటి సైనిక స్థావరాలు లేనప్పటికీ పాక్ ఈ దాడులకు పాల్పడిందని ఆఫ్ఘన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి షరఫత్ జమాన్ అమర్‌ఖైల్ చెప్పడం గమనార్హం. హాస్పిటల్ బిల్డింగ్లో మంటలను అదుపు చేయడానికి, శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీసేందుకు రెస్క్యూ బృందాలు ముమ్మరంగా పనిచేస్తున్నాయని ఆప్ఘన్ ప్రభుత్వ డిప్యూటీ ప్రతినిధి తెలిపారు.

Source : V6 News

1 hour ago

Home Flash News