చైనాలో ‘పెట్రో’ మంటలు.. బంక్ ల దగ్గర భారీగా క్యూ
టెహ్రాన్: ఖర్గ్ ఐలాండ్‌పై అమెరికా దాడి చేయడంతో అంతర్జాతీయంగా ప్రకంపనలు మొదలయ్యాయి. ప్రపంచంలోనే అత్యధిక చమురును దిగుమతి చేసుకునే చైనాను తీవ్ర ఆందోళనలోకి నెట్టింది. ధరలు భారీగా పెరుగుతాయన్న భయంతో చైనాలో పెట్రోల్ బంక్‌ల వద్ద వాహనదారులు కిలోమీటర్ల మేర బారులు తీరారు.
2024 లెక్కల ప్రకారం ఇరాన్ ఎగుమతి చేసే చమురులో 91% చైనాకే వెళ్తున్నది. షాన్‌డాంగ్ ప్రావిన్స్‌లోని చిన్న చమురు శుద్ధి కర్మాగారాలు(టీపాట్స్) తక్కువ ధరకు లభించే ఇరాన్ ఆయిల్‌పైనే ఆధారపడి నడుస్తున్నాయి. తాజా దాడులతో వీటి మనుగడ ప్రమాదంలో పడింది. దీంతోపాటు 2 వారాల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ఫిబ్రవరి 23న లీటరుకు రూ.99.3 ఉన్న
ధర, మార్చి నాటికి రూ.109.4కి చేరింది.