ఇరాన్ - ఇజ్రాయిల్ యుద్దాన్ని ఆపేలా మోడీ ప్రకటన చేయాలి: కూనంనేని సాంబశివరావు
కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా మార్చి 16న రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేయనున్నట్లు తెలిపారు కూనంనేని. పేదలకు ఇండ్ల స్థలాల పై మార్చి 20న చలో అసెంబ్లీ కి పిలుపునిచ్చారు. సింగరేణిని కాపాడెందుకు వారం రోజుల పాటు నిరసనలు చేయనున్నామని తెలిపారు కూనంనేని. రాష్ట్రంలో ప్రభుత్వం తీరు సరిగ్గా లేదని... రైతుబందు వేస్తారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు కూనంనేని. కాంగ్రెస్ మిత్రదర్మం పాటించలేదని..పొత్తుతో ఉన్నాం కాబట్టే వంద పంచాయతీలు గెలిచామని.. లేదంటే మరో 60 గెలిచేవాళ్ళమని అన్నారు కూనంనేని.
సీపీఐ నాయకులను కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు అవమానిస్తున్నారని..కాంగ్రెస్ పార్టీ పద్ధతి మారకపోతే.. పొత్తుకు దూరం అవ్వడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. పార్టీ ఫిరాయింపులకు సీపీఐ వ్యతిరేకమని..స్పీకర్ నిర్ణయాన్ని మేము ప్రశ్నించలేమని అన్నారు. ఫిరాయింపుల చట్టాలన్నీ మార్చాలని.. ఫిరాయింపులను చట్టాలను కఠినతరం చేయాలాని డిమాండ్ చేస్తున్నామని అన్నారు కూనంనేని.
అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచదేశాలు ఇంధన సంక్షోభం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇండియాపై కూడా గ్యాస్ సంక్షోభం తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై మోడీ వైఖరిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. అమెరికా చర్యలపై మోడీ మౌనం వీడాలని.. మోడీ పాలనలో ఇండియా చుట్టూ ఉన్న దేశాలతో పంచాయితీ ఏర్పడిందని అన్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దాన్ని ఆపేలా మోడీ ప్రకటన చేయాలని అన్నారు.