దుబాయ్ ఎయిర్‌పోర్టు సమీపంలో డ్రోన్ల దాడులు..
ఇంటర్నెట్‌డెస్క్: పశ్చిమాసియాలోని పలు దేశాలపై ఇరాన్ దాడులు పెంచుతోంది. తాజాగా దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం (Dubai Airport) సమీపంలో డ్రోన్ల దాడులు జరిగినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ దాడుల్లో నలుగురు గాయపడినట్లు తెలిపారు. క్షతగాత్రుల్లో ఒకరు భారత వ్యక్తి అని పేర్కొన్నారు. ఈ పరిణామాలతో ప్రయాణికులు, ఎయిర్‌పోర్ట్ సిబ్బందికి అధికారులు సేఫ్టీ నోటీసు జారీచేశారు. మరో వైపు విమానాశ్రయంలో ఇప్పటికే షెడ్యూల్ చేసిన పలు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయన్నారు. డ్రోన్ల దాడులతో విమానాశ్రయంలో పొగ కమ్మేసిన దృశ్యాలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. నిత్యం రద్దీగా ఉండే అంతర్జాతీయ విమానాశ్రయాల్లో దుబాయ్ ఎయిర్‌పోర్టు ఒకటి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల కారణంగా ఇక్కడి నుంచి విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.