KTR | ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డిల అక్రమ అరెస్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయలేకపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం, 1000 రోజుల్లో ఏమీ సాధించింది అంటే, అరెస్టులు, అక్రమ నిర్బంధాలు అని విమర్శించారు.

420 హామీలు అమలు అవుతాయి అంటే – బీఆర్ఎస్ పార్టీ ఎమ్యెల్సీలు, ఎమ్మెల్యేలు అందరూ వచ్చి స్వచ్ఛందంగా అరెస్ట్ అవుతామని కేటీఆర్ తెలిపారు. మేము సిద్ధం, మీరు సిద్ధమా అని సవాలు విసిరారు. అలానే మీకు మహిళల పట్ల గౌరవం ఉంటే నిన్న మా ఏమైల్యే లు సబితక్క, సునీతలకు చీరలు లాగి, మెడపట్టి గెంటి, కొట్టిన వారిపై ఏమీ చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
నిన్న హై కోర్ట్ అంత స్పష్టంగా చెప్పాక కూడా ఈరోజు కావాలని ఫేక్ కేసులు పెట్టి తాతా మధు, నవీన్ రెడ్డిని అరెస్టులు చేశారంటే మీకు కోర్టులు, చట్టాలు పట్ల ఉన్న గౌరవం అర్థం అవుతుందని కేటీఆర్ అన్నారు. ప్రజలు మీ డైవర్షన్ పాలిటిక్స్ ను గమనిస్తున్నారని తెలిపారు.