Select Location
All Locations
State
Region
City / District
కట్టప్ప కూతురు 'సీక్రెట్ మ్యారేజ్'.. అసలు నిజం బయటపెట్టిన సత్యరాజ్!

కట్టప్ప కూతురు 'సీక్రెట్ మ్యారేజ్'.. అసలు నిజం బయటపెట్టిన సత్యరాజ్!

‘బాహుబలి’ సినిమాలో కట్టప్పగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు సత్యరాజ్ కూతురు, ప్రముఖ న్యూట్రిషనిస్ట్, సోషల్ యాక్టివిస్ట్ దివ్య సత్యరాజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఆమె వ్యక్తిగత జీవితంపై నెట్టింట గత కొన్ని రోజులుగా షాకింగ్ రూమర్స్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. దివ్య ఒక వ్యక్తితో కలిసి ఉన్న కొన్ని ఫోటోలు వైరల్ అవ్వడంతో.. ఆమె ఎవరికీ తెలియకుండా 'సీక్రెట్ మ్యారేజ్' చేసుకుందంటూ నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది.

ఈ రూమర్లపై దివ్య సత్యరాజ్ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. హిల్ స్టేషన్‌లో నేను బ్లాక్ గ్లాసెస్ పెట్టుకుని ఒక వ్యక్తి పక్కన నిలబడిన ఫోటోను పెళ్లి ఫోటో అంటున్నారు. అసలు ఎవరైనా నల్ల అద్దాలు పెట్టుకుని పెళ్లి చేసుకుంటారా? ఆ ఫోటోలో ఉన్నది నేను కాదు, అది పూర్తిగా AI సృష్టించిన మాయ అంటూ కొట్టిపారేశారు. ఇక నెటిజన్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. 'నాకు రెండు పెళ్లిళ్లు, ముగ్గురు పిల్లలంట' అంటూ సెటైరికల్‌గా నవ్వేశారు.


V6 News 1 hour ago
Home Flash News