బినామీలకు దోచిపెట్టడమే చంద్రబాబు పని : రోజా
సీఎం చంద్రబాబు తన బినామీలకు దోచిపెట్టే పనిలో బిజీగా ఉన్నారని మాజీ మంత్రి రోజా ఆరోపించారు. అమరావతిలో ఫ్లైఓవర్ల నిర్మాణంలో కూటమి ప్రభుత్వం దోచుకుంటోందని వైఎస్ జగన్ చేసిన ఆరోపణలకు ఆమె మద్దతిచ్చారు. నేషనల్ హైవే నిర్మాణానికి కిలోమీటర్‌కు రూ.24 కోట్లు అయితే అమరావతిలో మాత్రం కిలోమీటర్‌కు రూ.53 కోట్లు ఖర్చు చేస్తున్నారని రోజా వ్యాఖ్యానించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్‌కు వైసీపీ హయాంలో కిలోమీటర్‌కు రూ.69 కోట్లు ఖర్చు అయితే అదే అమరావతి ఫ్లైఓవర్లకు రూ.189 కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.