Select Location
All Locations
State
Region
City / District
IPL 2026 SRH In PlayOffs: ఇ'షాన్ దార్' ఇన్నింగ్స్.. ప్లే ఆఫ్స్ కు చేరిన స‌న్ రైజ‌ర్స్, జీటీ కూడా, రాణించిన క్లాసెన్, క‌మిన్స్..

IPL 2026 SRH In PlayOffs: ఇ'షాన్ దార్' ఇన్నింగ్స్.. ప్లే ఆఫ్స్ కు చేరిన స‌న్ రైజ‌ర్స్, జీటీ కూడా, రాణించిన క్లాసెన్, క‌మిన్స్..

IPL 2026 SRH VS CSK Result Update: నువ్వా నేనా..? అన్న‌ట్లు సాగిన మ్యాచ్ లో మాజీ చాంపియ‌న్ స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ థ్రిల్లింగ్ విక్ట‌రీని సాధించింది. త‌మ రిప్యూటేష‌న్ కు భిన్నంగా పిచ్ కు త‌గిన‌ట్లుగా బ్యాటింగ్ చేసిన స‌న్.. ఆతిథ్య చెన్నై సూప‌ర్ కింగ్స్ పై 5 వికెట్ల‌తో ఘ‌న విజయం సాధించింది. చేపాక్ స్టేడియంలో సోమ‌వారం జ‌రిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన సీఎస్కే 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల‌కు 180 ప‌రుగులు చేసింది. మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ డెవాల్డ్ బ్రివిస్ (27 బంతుల్లో 44, 2 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. బౌలర్ల‌లో పాట్ క‌మిన్స్ మూడు వికెట్ల‌తో స‌త్తా చాటాడు. 

అనంత‌రం ఛేజింగ్ ను స‌న్ రైజ‌ర్స్ కాస్త క‌ష్ట‌ప‌డి పూర్తి చేసింది. 19 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల‌కు 181 ప‌రుగులు చేసింది. వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ఇషాన్ కిష‌న్ సూప‌ర్బ్ ఫిఫ్టీ (47 బంతుల్లో 70, 7 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. బౌల‌ర్ల‌లో ముకేశ్ చౌద‌రీకి రెండు వికెట్లు ద‌క్కాయి. ఈ విజ‌యంతో 16 పాయింట్ల‌తో స‌న్ రైజ‌ర్స్, గుజ‌రాత్ టైటాన్స్ ప్లే ఆఫ్స్ బెర్త్ ద‌క్కించుకున్నాయి. ఇప్ప‌టికే ఆర్సీబీ ప్లే ఆఫ్స్ కు చేరిన సంగ‌తి తెలిసిందే. మ‌రో స్థాన కోసం ముఖ్యంగా పంజాబ్ కింగ్స్, కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ మ‌ధ్య ముఖ్యంగా పోటీ నిల‌వ‌నుంది. తాజా ఓట‌మితో దాదాపుగా ఢిల్లీ, చెన్నై క‌థ ముగిసిన‌ట్లే. మంగ‌ళ‌వారం జ‌రిగే మ్యాచ్ లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి.


ABP Desam 5 days ago
Home Flash News