ఆపరేషన్ సిందూర్‌కు ఏడాది.. మరోసారి మీడియా ముందుకు ఆ ఇద్దరు..
ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా గతేడాది మే7న భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) చేపట్టిన సంగతి తెలిసిందే. ఆనాటి ఆపరేషన్ విషయాలను వెల్లడించి.. దేశ ప్రజల దృష్టిని ఆకర్షించిన అధికారిణులు (Women officers) మరోసారి మీడియా ముందుకు రానున్నారు. మే7తో ఆపరేషన్ నిర్వహించి ఏడాది కావస్తుండడంతో అదే తేదీన కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియా ముందుకు రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు అధికార వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ ఇద్దరు అధికారిణులతో పాటు ఈ మీడియా సమావేశంలో నేవీ కమాండర్ ప్రేరణా దేవస్థలి, మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ బ్రీఫింగ్‌లో ఆపరేషన్ సిందూర్ మెరుపు దాడులకు సంబంధించిన వివరాలు, ప్రాముఖ్యత, దాని వెనుక జరిగిన ప్రణాళిక వంటి విషయాల గురించి వారు మాట్లాడే అవకాశం ఉంది. దేశ రక్షణలో పెరుగుతున్న మహిళా అధికారుల పాత్రను దేశ ప్రజలకు తెలియజేయడం కూడా ఈ కార్యక్రమం వెనుక ఉన్న మరో ఉద్దేశంగా తెలుస్తోంది.
పవన్ ఖేరాకు ముందస్తు బెయిల్ గుజరాత్‌కు చెందిన సోఫియా (Colonel Sophia Qureshi).. బయోకెమిస్ట్రీలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1990ల్లో సైన్యంలో చేరారు. ఆర్మీ సిగ్నల్ కోర్‌కు చెందిన సీజన్డ్ ఆఫీసర్. మూడు దశాబ్దాల ప్రయాణంలో ఆమె రాజీలేని వైఖరి ప్రదర్శించారు. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ (Wing Commander Vyomika Singh) ఇంజినీరింగ్ విద్యను పూర్తిచేసి, భారత వైమానిక దళంలోని హెలికాప్టర్ పైలట్‌గా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. డిసెంబర్ 18, 2019న ఫ్లయింగ్ బ్రాంచ్‌లో శాశ్వత కమిషన్ హోదా పొందారు.