Select Location
All Locations
State
Region
City / District
సమ్మక్క- సారలమ్మ ట్రైబల్‌ వర్సిటీ పనులు త్వరలో ప్రారంభం: కిషన్‌రెడ్డి

సమ్మక్క- సారలమ్మ ట్రైబల్‌ వర్సిటీ పనులు త్వరలో ప్రారంభం: కిషన్‌రెడ్డి

హైదరాబాద్: సమ్మక్క- సారలమ్మ ట్రైబల్‌ యూనివర్సిటీ క్యాంపస్‌ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. మే 10న హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ.. రూ.7,823 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తారని చెప్పారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి ఈమేరకు మీడియాతో మాట్లాడారు. ‘‘హైదరాబాద్‌లో పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి టెర్మినల్‌ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. మహబూబ్‌నగర్‌లో రూ.3,175 కోట్ల విలువైన జాతీయ రహదారి పనులకు వర్చువల్‌గా శ్రీకారం చుట్టనున్నారు.

హఫీజ్‌పేట, జోగులాంబ రైల్వేస్టేషన్లను, కాజీపేట- విజయవాడ మధ్య మూడో రైల్వే లైన్‌ను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో రూ.85 వేల కోట్ల రైల్వే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. హైదరాబాద్‌-యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్‌ పనులు ప్రారంభమయ్యాయి. కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ను అభివృద్ధి చేస్తున్నాం. 2030 నాటికి రూ.9 లక్షల కోట్ల విలువైన టెక్స్‌టైల్‌ ఉత్పత్తులను ఎగుమతి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని కిషన్‌రెడ్డి తెలిపారు.


Eenadu Telugu 15 hours ago
Home Flash News