Select Location
All Locations
State
Region
City / District
Telangana SSC Results 2026: తెలంగాణ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల.. 95.15 శాతం విద్యార్థులు పాస్.. ఫలితాల కోసం డైరెక్ట్ లింక్

Telangana SSC Results 2026: తెలంగాణ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విడుదల.. 95.15 శాతం విద్యార్థులు పాస్.. ఫలితాల కోసం డైరెక్ట్ లింక్

Telangana SSC Results 2026 | హైదరాబాద్: తెలంగాణ పదో తరగతి విద్యార్థుల సుదీర్ఘ నిరీక్షణకు నేటితో తెరపడింది. రాష్ట్ర విద్యాశాఖ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎస్సీఈఆర్టీ (SCERT) కార్యాలయంలో ఫలితాలను విడుదల చేసింది. పరీక్షలకు హాజరైన వారిలో 95.15 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు, విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణా టెన్త్ బోర్డ్ ఎగ్జామ్ ఫలితాలను వెల్లడిస్తారు. విద్యార్థులు ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://results.bse.telangana.gov.in/ , https://results.bsetelangana.org/ లో డైరెక్ట్ లింక్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,26,166 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కాగా, అందులో 4,97,312 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 95.15 శాతం మంది టెన్త్ విద్యార్థులు పాసయ్యారు. 

గత ఏడాదితో (92.78%) పోలిస్తే ఈసారి ఫలితాలు మెరుగయ్యాయి. వాట్సాప్‌లో Hi లని మెస్సేజ్ చేస్తే ఫలితాలు.. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ https://bse.telangana.gov.in/ ద్వారా చూసుకోవచ్చు. అంతేకాకుండా, ఈసారి సాంకేతికతను జోడిస్తూ వాట్సాప్‌లో కూడా ఫలితాలను పొందే వెసులుబాటు కల్పించారు. దీనికోసం అభ్యర్థులు 8096958096 నంబర్‌ను సేవ్ చేసుకుని, వాట్సాప్‌లో Hi అని మెసేజ్ చేయాలి. అనంతరం SSC Results లేక టెన్త్ క్లాస్ రిజల్ట్స్ అని కనిపిస్తే.. క్లిక్ చేసి, హాల్‌టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే వెంటనే ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఆ రిజల్ట్స్ పీడీఎఫ్ రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవాలి. విద్యార్థుల సౌకర్యార్థం ఈ నూతన విధానాన్ని ప్రవేశపెట్టినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. 

మరోసారి సత్తా చాటిన అమ్మాయిలు ఈ ఏడాది కూడా ఉత్తీర్ణతలో బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 96.26% గా నమోదు కాగా, బాలుర ఉత్తీర్ణత శాతం 94.07% గా ఉంది. బాలుర కంటే బాలికలు 2.19 శాతం అధిక ఉత్తీర్ణత సాధించి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. రెగ్యులర్ అభ్యర్థుల పరంగా చూస్తే మొత్తం 5,16,815 మంది పరీక్ష రాయగా, అందులో 4,91,774 మంది పాస్ అయ్యారు. ములుగు టాప్.. హైదరాబాద్ లాస్ట్ రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వారీగా చూస్తే, ములుగు జిల్లా 99.30% ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. దురదృష్టవశాత్తూ, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ జిల్లా 89.23% ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. విద్యాసంస్థల వారీగా చూస్తే, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలు 99.1% ఉత్తీర్ణతతో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాయి. రాష్ట్రవ్యాప్తంగా 5,731 పాఠశాలలు 100% ఫలితాలను సాధించగా, 6 పాఠశాలలు మాత్రమే 0% ఫలితాలను నమోదు చేశాయి. 

వాట్సాప్‌లోనే ఫలితాలు చెక్ చేసుకోండి. - మీ ఫోన్లో 8096958096 సేవ్ చేసుకోండి. - ఆపై మీ వాట్సాప్‌లో 8096958096కి Hi అని పంపాలి - తర్వాత SSC Results అని టైప్ చేసి హాల్‌టికెట్ నంబర్ ఎంటర్, వివరాలు చేయాలి. - హాల్ టికెట్ నెండర్, మీ వివరాలు సరిగ్గా ఉన్నట్లయితే స్క్రీన్‌పై రిజల్ట్ కనిపిస్తుంది. - మీ రిజల్ట్స్ పీడీఎఫ్ రూపంలో సేవ్ చేసుకుని, ప్రింటౌట్ తీసుకోవాలి. ఈ ఏడాది మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగిన పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5.28 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. మే మొదటి వారంలో ఫలితాలు విడుదల చేయాలని భావించినప్పటికీ, విద్యార్థుల భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ యుద్ధ ప్రాతిపదికన ఆన్సర్ షీట్ల వాల్యుయేషన్ పూర్తి చేసి ముందుగానే ఫలితాలను సిద్ధం చేసింది.


ABP Desam 1 hour ago
Home Flash News