Select Location
All Locations
State
Region
City / District
Jana Nayagan: ‘జన నాయగన్’ కేసులో ట్విస్ట్.. ఎడిటర్‌ సస్పెండ్.. ఈ టాలెంటెడ్ ప్రదీప్ హిట్ మూవీస్ ఇవే!

Jana Nayagan: ‘జన నాయగన్’ కేసులో ట్విస్ట్.. ఎడిటర్‌ సస్పెండ్.. ఈ టాలెంటెడ్ ప్రదీప్ హిట్ మూవీస్ ఇవే!

సినీ ఇండస్ట్రీ పైరసీ భూతంతో పోరాడుతుంది. కనిపించని ఈ మాయ భూతం, మన చుట్టూ ఉన్నవాళ్ల రూపంలోనే తిరుగుతూ కోట్ల రూపాయల నష్టాలను కలిగిస్తోంది. మేకర్స్ (24 క్రాఫ్ట్స్) మీద నమ్మకం ఉంచిన నిర్మాతలు, నిర్మాతలపై ఆధారపడిన డిస్ట్రిబ్యూటర్లు.. పైరసీ దెబ్బతో తీవ్రంగా నష్టపోతున్నారు. పైరసీని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కఠిన నిబంధనలు తీసుకొచ్చినా, అది పూర్తిగా నియంత్రణలోకి రావడం లేదు. నిజానికి పైరసీ కొన్ని సంవత్సరాలుగా లేదు. కానీ, 2025 జనవరి నుంచి మాత్రం విచ్చలవిడిగా ఎగబాకింది. ఇటీవల దళపతి విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా కూడా పైరసీకి గురవడం ఈ సమస్య తీవ్రతను మరోసారి స్పష్టంగా చూపిస్తోంది.

థియేటర్లలో విడుదలకు ముందే పూర్తి సినిమా పైరసీ వెబ్‌సైట్లలో ప్రత్యక్షమవ్వడం నిర్మాతలు మరియు అభిమానులను తీవ్రంగా కలవరపరిచింది. ఈ నేపథ్యంలో నిర్మాతలు KVN ప్రొడక్షన్స్ ఇచ్చిన ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి, పలువురిని అరెస్ట్ చేసి న్యాయస్థాన రిమాండ్‌కు పంపించారు. ఈ క్రమంలోనే, ‘జన నాయగన్’ పైరసీ వ్యవహారంలో ఒక కీలక అంశం వెలుగులోకి వచ్చింది. జన నాయగన్ ఎడిటర్ సస్పెండ్: దక్షిణ భారత ఫిల్మ్ ఎడిటర్స్ అసోసియేషన్ (SIFEA) కీలక నిర్ణయం తీసుకుంది. 

జన నాయగన్ మూవీ ఎడిటర్ ప్రదీప్ ఈ. రాఘవ్‌ను (Pradeep E Raghav) అసోసియేషన్ సస్పెండ్ చేసింది. ‘జన నాయగన్’ చిత్రాన్ని ఆన్‌లైన్‌లో అక్రమంగా లీక్ అవ్వకుండా అరికట్టడంలో విఫలమయ్యారని, అలాగే యూనియన్ నియమాలను ఉల్లంఘించారని ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకుంది. ఏప్రిల్ 17న జరిగిన అత్యవసర కార్యనిర్వాహక కమిటీ సమావేశం అనంతరం, శుక్రవారం ఏప్రిల్ 24న ఈ నిర్ణయం తీసుకుంది. పోలీసుల విచారణలో, ఒక ఫ్రీలాన్స్ ఎడిటర్ అక్రమంగా ఎడిటింగ్ రూమ్‌లోకి ప్రవేశించి సినిమా ఫుటేజీని దొంగిలించినట్లు వెల్లడైంది.


V6 News 1 day ago
Home Flash News