గవర్నర్ అబ్దుల్ నజీర్ త్వరగా కోలుకోవాలి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురికావడంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పందించారు. గవర్నర్ అనారోగ్యానికి గురయ్యారన్న వార్త బాధ కలిగించిందని అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని వైఎస్ జగన్ పేర్కొన్నారు. కాగా, అబ్దుల్ నజీర్ కడుపు నొప్పితో బాధపడడంతో శనివారం తెల్లవారుజామున మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది. అబ్దుల్ నజీర్ శుక్రవారం బెంగళూరు నుంచి విజయవాడకు రావాల్సి ఉండగా అర్ధరాత్రి 12 గంటలకు బెంగళూరు నుంచి రావాల్సిన గవర్నర్ విమానం ఆలస్యమైంది. అర్ధరాత్రి గంటలకు గవర్నర్ విజయవాడ చేరుకున్నారు. ఆ తర్వాత శనివారం తెల్లవారుజామున 4.30 గంటలకు అబ్దుల్ నజీర్ కడుపులో నొప్పి బాధపడ్డారు. ఆసుపత్రిలో వైద్యులు ఆయనకు చికిత్స అందించారు.