Select Location
All Locations
State
Region
City / District
ఐసీసీ కీలక పదవి నుంచి వైదొలిగిన పీసీబీ మాజీ సీఈవో

ఐసీసీ కీలక పదవి నుంచి వైదొలిగిన పీసీబీ మాజీ సీఈవో

ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ మాజీ సీఈవో వాసిమ్ ఖాన్ అంతర్జాతీయ క్రికెట్ కమిటీ నుంచి వైదొలిగారు. ఐసీసీ జనరల్ మేనేజర్‌ పదవికి గుడ్‌బై చెప్పేశారు. నాలుగేళ్లపాటు ఆ బాధ్యతలు నిర్వర్తించిన ఆయన పదవిని వీడారు. జెఫ్‌ అల్లార్డెస్ నుంచి 2022లో వాసిమ్‌ ఖాన్ బాధ్యతలను స్వీకరించారు. అంతకుముందు ఆయన పీసీబీ సీఈవోగా మూడేళ్లు పనిచేశారు. ఇప్పుడు వైదొలిగినా.. మరో పదవీ బాధ్యతలను తీసుకొనే అవకాశం ఉందని క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే చాలామంది.. గత రెండేళ్లుగా ఐసీసీలో భారీ మార్పులే చోటుచేసుకున్నాయి.

అత్యున్నత స్థాయిలో ఉండే వ్యక్తులు తమ పదవులను వదిలేశారు. అల్లార్డెస్‌తోపాటు యాంటీ కరప్షన్ యూనిట్‌కు చెందిన క్రిస్ టెట్లీ, అలెక్స్ మార్షల్ వైదొలిగారు. వారి స్థానంలో గౌరవ్ సక్సేనా, ఆండ్రూ వచ్చి చేరారు. ఇప్పుడు వాసిమ్‌ఖాన్‌ తన పదవికి రాజీనామా చేశాడు. పాక్‌ క్రికెట్‌ బోర్డులో కీలక బాధ్యతలు చేపట్టిన వాసిమ్‌ ఇంగ్లాండ్‌లో జన్మించడం గమనార్హం. అక్కడే తన క్రికెట్‌ కెరీర్‌ను మొదలుపెట్టాడు. పాక్‌ మూలాలు ఉన్నప్పటికీ.. ఈ జట్టు తరఫున ఒక్క మ్యాచూ ఆడలేదు. కానీ, పీసీబీకి సీఈవోగా పనిచేశారు.


Eenadu Telugu 1 hour ago
Home Flash News