Select Location
All Locations
State
Region
City / District
కేజ్రీ వాదనలు అనూహ్యం..అపూర్వం!

కేజ్రీ వాదనలు అనూహ్యం..అపూర్వం!

జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ ఎదుట తన వాదనలు వినిపించినప్పుడు, కేజ్రీవాల్‌ ప్రశాంతంగా వ్యవహరించారు. పూర్తిగా ప్రొఫెషనల్‌గా మాట్లాడారు. అత్యంత గంభీరమైన అనుమానాలను కూడా ఎంతో జాగ్రత్తగా, తగిన మాటలతో వ్యక్తపరిచారు. ఒక్కసారి కూడా న్యాయవ్యవస్థను అవమానించేలా మాట్లాడలేదు. న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేయని ఒక రాజకీయ నాయకుడి నుంచి కోర్టు వ్యవహారాలపై ఇంత స్పష్టత, నియంత్రణ కనిపించడం అసాధారణం. తనపై న్యాయమూర్తి పక్షపాతం చూపవచ్చని భావించే వారికి ఇప్పుడు ఆయన ఒక మార్గదర్శకంగా నిలిచారు. ఇప్పుడు ఆయన చేసిన వాదనల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవటానికి, వాటిపై చర్చ అవసరం. 

తర్వాత వచ్చే తీర్పు ఎలా ఉన్నా. మార్చి 9న సీబీఐ అప్పీల్‌ వేయడం ద్వారా హైకోర్టును ఆశ్రయించినప్పుడు, జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ, సెషన్స్‌ కోర్టు జడ్జి జితేంద్ర ప్రసాద్‌ సింగ్‌ ఇచ్చిన డిశ్చార్జ్‌ ఆర్డర్‌ను, మరో పక్షాన్ని వినకుండానే తప్పుగా ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ సమయంలో కేజ్రీవాల్‌ తరఫున అక్కడ ఎవరూ లేరు. నెలల తరబడి విచారణ జరిగిన తర్వాత వచ్చిన ఆర్డర్‌పై, ట్రయల్‌ కోర్టు రికార్డు లేకుండా ఇంత గంభీర వ్యాఖ్యలు ఎలా చేయగలరు? దీనివల్ల కేజ్రీవాల్‌కు అనుమానం కలుగడం సహజం. సెషన్స్‌ కోర్టు జడ్జి లిక్కర్‌ స్కాం కేసులో తీర్పునిస్తూ విచారణాధికారి సరైన విచారణ చేపట్టకుండా అప్రూవర్‌లు ఇచ్చిన స్టేట్మెంట్‌ను ఆధారం చేసుకుని చార్జిషీట్‌ వేశారు కాబట్టి ఆ (IO)పై డిపార్ట్మెంట్‌ విచారణకు ఆదేశించారు. 

అలాగే ఆయనపై గంభీర వ్యాఖ్యలు చేశారు. విచారణ ముందే కేసును ఎవరిపై నమోదు చేయాలో నిర్ణయించుకున్నట్లు ఉన్నదని కూడా పేర్కొన్నారు. అయితే, ఆ IO కోర్టులో లేకపోయినా, అతని నుంచి అభ్యర్థన రాకపోయినా, అతనిపై చర్యలను వెంటనే నిలిపివేశారు జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ. గతంలో ఇదే కేసులో బెయిల్‌ పిటిషన్లను తిరస్కరిస్తూ జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ చేసిన వ్యాఖ్యలు మీడియాకు మరింత ప్రచారం చేయటానికి అవకాశమిచ్చాయి. అభియుక్తులను నేరస్థులుగా చూపించేందుకు, సాధారణంగా బెయిల్‌ విషయంలో కోర్టు అనుమతిస్తుంది. లేదా తిరస్కరిస్తుంది. విచారణ పూర్తికాకముందే ఇలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేయటం మూలంగా వారు నేరస్థులు అని అర్థం వచ్చేలా అవకాశం ఇచ్చారు. ఈ బెయిల్‌ కేసులన్నింటిలోనూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ స్వర్ణకాంత శర్మ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. ఒకటి రెండు కేసుల్లో తప్పు జరిగిందనుకోవచ్చు. కానీ అన్ని కేసుల్లోనూ రద్దు కావడం గంభీరమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నది.


Smacy News 1 day ago
Home Flash News