... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
సైన్యంలోకి మీ ఉద్యోగులను నామినేట్ చేయండి..!

సైన్యంలోకి మీ ఉద్యోగులను నామినేట్ చేయండి..!

ఇంటర్నెట్‌ డెస్క్: ఉక్రెయిన్‌తో నాలుగేళ్లుగా యుద్ధం కారణంగా దాదాపు 3.25 లక్షల మంది రష్యా (Russia) సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మళ్లీ తన సైన్యాన్ని బలోపేతం చేసేందుకు అధికారులు కాంట్రాక్టు పద్ధతిలో భారీగా సైన్యాన్ని సమీకరిస్తున్నారు. ఇందుకోసం రహస్య నియామకాలు జరుగుతున్నాయని.. సైనిక శిక్షణ తీసుకున్నవారే కాకుండా వివిధ వర్గాల పౌరులు కూడా రష్యన్‌ ఆర్మీలో చేరాలని అధికారులు ప్రజలను కోరుతున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. సైనిక సేవల కోసం ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలలోని ఉద్యోగులను నామినేట్ చేయాల్సిందిగా పలు పెద్ద కంపెనీలు, వ్యాపార సంస్థలకు ర్యాజాన్ నగర గవర్నర్ రహస్య నోటీసులు పంపినట్లు బిజినెస్ ఇన్‌సైడర్ వెల్లడించింది. కంపెనీల్లో పని చేసే ఉద్యోగులను సైనిక అభ్యర్థులుగా షార్ట్ లిస్ట్‌ చేసి, ఆ జాబితాను సెప్టెంబర్ 20లోగా తమకు పంపాల్సిందిగా ఆయన కోరినట్లు తెలిపింది. నోటీసు ప్రకారం.. 

సైన్యంలోకి ఎంపిక చేసే అభ్యర్థుల సంఖ్య కంపెనీ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. 150-300 మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు కనీసం రెండు పేర్లను, 300-500 మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు మూడు పేర్లను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది. 500 లేదా అంతకంటే ఎక్కువమంది ఉద్యోగులు ఉన్న సంస్థలు ఐదుగురిని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ ఆదేశాలు పాటించని కంపెనీలకు పెద్ద మొత్తంలో జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చీమలు తిని బతికి బయటపడి.. నాడు శత్రుదేశంలో చిక్కిన అమెరికా సైనికుడి పరిస్థితి..! సైనిక సమీకరణ ప్రక్రియను వీలైనంత తొందరగా పూర్తి చేసి, ఎంపిక చేసిన వారిని పోరాటానికి సిద్ధం చేయడానికి రష్యా మిలిటరీ, నేవీ కమాండర్లు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. శిక్షణ పూర్తైన వెంటనే వారిని యుద్ధంలో భాగం చేసే అవకాశం ఉంది.

Source : Eenadu Telugu

2 hours ago

Home Flash News