Roja Selvamani : స్టెప్పులతో అదరగొట్టిన రోజా..11 ఏళ్ల తర్వాత వెండితెరపై రీఎంట్రీ!
దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగి అగ్రనటి రోజా సెల్వమణి వెండితెరపైకి రీఎంట్రీ ఇచ్చారు. రాజకీయాల్లో బిజీ ఉన్న ఆమె దాదాపు 11 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు మళ్లీ కెమెరా ముందుకు వచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఈ సెకండ్ ఇన్నింగ్ తన సత్తా చాటేందుకు రెడీ అయింది. అయితే ఆమె ప్రస్తుతం తమిళ చిత్రాల్లో నటిస్తుంది. ఇప్పటికే 'లెనిన్ పాండియన్' మూవీలో నటించిన రోజా మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానుంది.
'జమా ' మూవీ ఫేమ్ పారి ఇళవళగన్ హీరోగా స్వీయదర్శకత్వంలో వస్తున్న చిత్రం 'అన్బే డయానా'. నీయా కాస్టిల్స్ క్రియేషన్స్, మిలియన్ డాలర్స్ స్టూడియోస్ అధినేథలు యువగార్ గణేశన్, సత్య కరికాలన్ కలిసి ఈ చిత్రాన్ని సినిమాను నిర్మిస్తున్నారు. భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రంలో పారి ఇళవళగన్ సరసన రమ్య రంగనాథన్ నటిస్తోంది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇందులో హీరో, హీరోయిన్లతో పాటు రోజా స్టెప్పులేశారు. ఈ పాటను జెస్సీ గిఫ్ట్ ఆలపించారు. సంగీత ప్రియులను ఈ పాట ఎంతో ఆకట్టుకుంటుంది. రోజా డ్యాన్స్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు.
2015లో వచ్చిన 'ఎన్ వళి తని వళి' తర్వాత రోజా సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాల్లో బిజీ అయ్యారు. సుదీర్ఘ విరామ తర్వాత తిరిగి తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఇటీవల 'లెనిన్ పాండియన్' అనే తమిళ చిత్రంతో వెండితెరపై తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఈ సినిమా దాదాపు పూర్తికావచ్చింది. ఇప్పుడు ఈ 'అన్బే డయానా' చిత్రంలో హీరోకి తల్లిగా ఒక కీలకమైన, పవర్ ఫుల్ పాత్రలో రోజా కనిపించబోతున్నారు.
ఇప్పుటికే దాదాపు షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ 'అన్బే డయానా' మూవీ తమిళనాడులోని ఒక గ్రూపు నేపథ్యంలో తెరకెక్కించినట్లు సమాచారం. రొమాంటిక్ , ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా సాగుతుంది. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. నటుడు చేతన్, వైరల్ యూ ట్యూబర్, పరితాపంగల్ గోపి, ఇస్మత్ భాను, సుదర్శన్ గాంధీ, సెల్ మురుగన్ వంటి ప్రముఖులు ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ఈ మూవీకి భరత్ శంకర్ సంగీతం అందించారు. మరి సెకండ్ ఇన్నింగ్ లో రోజా ఏ మాత్రం ఆకట్టుకుంటారో చూడాలి మరి.