మైనార్టీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నం: మంత్రి వివేక్ వెంకటస్వామి
మైనార్టీల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్వెంకటస్వామి అన్నారు. ఈద్గా, దర్గాలలో మౌళిక సదుపాయాల కల్పన కు కృషి చేస్తామని చెప్పారు. రంజాన్ పండుగ సందర్భంగా మంచిర్యాల జిల్లా మందమర్రి విద్యానగర్, సీఈఆర్ క్లబ్ సమీపంలోని ఈద్దాల వద్ద ముస్లిం సోదరులతో కలసి ప్రార్థనల్లో పాల్గొన్నా రు. వారికి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చెన్నూరు నియోజక వర్గంలో హిందువులు, ముస్లింలు ఐక్యతగా సోదర భావంతో మెలగాలన్నారు. ప్రేమానురాగాలు, మానవత్వంతో ప్రజలందరూ ఉన్నప్పుడే సమాజం సుభిక్షంగా ఉంటుందన్నారు. ముస్లీంలకు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, తాను అండగా ఉంటామన్నారు. చెన్నూరు నియోజకవర్గం పరిధిలో ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఈద్గా, దర్గాలకు కావాల్సిన మౌళిక సదుపాయాలను కల్పిస్తున్న ట్లు వివరించారు.
మందమర్రిలో రు.50లక్షలతో షాదిఖానా,ఈద్గా వద్ద కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేసేందుకు పనులను త్వరలోనే ప్రారంభిస్తామ న్నారు. సింగరేణి సంస్థతో మాట్లాడి మందమర్రి ఈద్గా వద్ద కమాన్ ఏర్పాటు చేస్తామన్నారు. కాంగ్రెస్ సెక్యూలర్ పార్టీ అని, ముస్లీంలకు అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. మందమర్రి, రామకృష్ణాపూర్ పట్టణాల్లోని పలు ముస్లింల ఇండ్లలో షేమియాను మంత్రి సేవించారు. మంత్రి వెంట డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మైనార్టీ నేతలు అబ్దుల్ అజీజ్, యాకుబ్ అలీ ఉన్నారు.