... SMACY
Home Flash News {"Tamil Nadu":"Ariyalur,Chengalpattu,Chennai,Coimbatore,Cuddalore,Dharmapuri,Dindigul,Erode,Kallakurichi,Kanchipuram,Kanyakumari,Karur,Krishnagiri,Madurai,Mayiladuthurai,Nagapattinam,Nilgiris,Namakkal,Perambalur,Pudukkottai,Ramanathapuram,Ranipet,Salem,Sivaganga,Tenkasi,Tirupur,Tiruchirappalli,Theni,Tirunelveli,Thanjavur,Thoothukudi,Tirupattur,Tiruvallur,Tiruvarur,Tiruvannamalai,Vellore,Viluppuram,Virudhunagar","Kerala ":"Alappuzha,Ernakulam,Idukki,Kannur,Kasargod,Kollam,Kottayam,Kozhikode,Malappuram,Palakkad,Pathanamthitta,Thiruvananthapuram,Thrissur,Wayanad ","Pondichery":"Karaikal,Mahe,Puduchery,Yanam","Karnataka":"Bagalkot,Ballari,Belagavi,BengaluruRural,BengaluruUrban,Bidar,Chamarajanagar,Chikkaballapur,Chikkamagaluru,Chitradurga,DakshinaKannada,Davanagere,Dharwad,Gadag,Hassan,Haveri,Kalaburagi,Kodagu,Kolar,Koppal,Mandya,Mysuru,Raichur,Ramanagara,Shivamogga,Tumakuru,Udupi,UttaraKannada,Vijayanagara,Vijayapura,Yadgir","Andhra Pradesh":"AlluriSitharamaRaju,Anakapalli,Ananthapuram,Annamayya,Bapatla,Chittoor,EastGodavari,Eluru,Guntur,Kakinada,KonaSeema,Krishna,Kurnool,Manyam,Nandyal,NTR,Palnadu,Prakasam,SPSNellore,SriSatyasai,Thirupathi,Srikakulam,Vishakhapatnam,Vizianagaram,WestGodavari,YSRKadapa","Telangana":"Adilabad,BhadradriKothagudem,Hanumakonda,Hyderabad,Jagtial,Jangaon,JayashankarBhupalpally,JogulambaGadwal,Kamareddy,Karimnagar,Khammam,KumuramBheemAsifabad,Mahabubabad,Mahabubnagar,Mancherial,Medak,MedchalMalkajgiri,Mulugu,Nagarkurnool,Nalgonda,Narayanpet,Nirmal,Nizamabad,Peddapalli,RajannaSircilla,Rangareddy,Sangareddy,Siddipet,Suryapet,Vikarabad,Wanaparthy,Warangal,YadadriBhuvanagiri"} Login
నేను ఏదైనా చేయగలను.. క్యూబా స్వాధీనంపై ట్రంప్‌ వ్యాఖ్యలు

నేను ఏదైనా చేయగలను.. క్యూబా స్వాధీనంపై ట్రంప్‌ వ్యాఖ్యలు

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇరాన్‌తో యుద్ధాన్ని కొనసాగిస్తోన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ (Donald Trump) తాజాగా క్యూబాను స్వాధీనం చేసుకోవడంపై దృష్టిసారించారు. ఆ ద్వీప దేశాన్ని తమ నియంత్రణలోకి తీసుకుంటామని వ్యాఖ్యానించారు. క్యూబా వ్యాప్తంగా.. విద్యుత్‌ వ్యవస్థ కుప్పకూలిన నేపథ్యంలో ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ట్రంప్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ‘క్యూబా (Cuba)ను స్వాధీనం చేసుకునే అవకాశం నాకు దక్కుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. అది చాలా గొప్ప విషయం. అది నాకు పెద్ద గౌరవం. దాన్ని స్వాధీనం చేసుకోగలను. దానితో నేను ఆశించినది ఏదైనా దక్కించుకోగలను’ అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. కాగా.. అమెరికా చమురు ఆంక్షల నేపథ్యంలో క్యూబాలో విద్యుత్‌ వ్యవస్థ కుప్పకూలింది. దీంతో 9.6 మిలియన్ల మంది ప్రజలు అంధకారంలో చిక్కుకుపోయారు. అమెరికా ఆంక్షల వల్ల గత మూడు నెలలుగా క్యూబాకు ఎలాంటి భారీ ఇంధన రవాణా జరగలేదని క్యూబా అధ్యక్షుడు మిగెల్‌ దియాజ్‌ కానెల్‌ గతవారం పేర్కొన్నారు. విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణకు చర్యలు ప్రారంభించినట్లు ఆ దేశ సంబంధిత శాఖ తాజాగా వెల్లడించింది.

Source : Eenadu Telugu

1 hour ago

Home Flash News