ముగిసిన కొమురవెల్లి బ్రహ్మోత్సవాలు
చివరి వారానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
కొమురవెల్లి, వెలుగు : కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా అర్ధరాత్రి నిర్వహించిన అగ్నిగుండాల కార్యక్రమాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మూడు నెలలుగా కొనసాగిన బ్రహ్మోత్సవాలు ఆదివారం అర్ధరాత్రి జరిగిన అగ్నిగుండాలతో ముగిశాయి.

స్వామివారిని దర్శించుకున్న మంత్రి కొండా సురేఖ
కొమురవెల్లి మల్లికార్జున స్వామివారిని ఆదివారం మంత్రి కొండా సురేఖ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ మండపంలో పట్నాలు వేసి, బోనాలు సమర్పించారు. అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ... కొమురవెల్లి మల్లన్న ఆలయ అభివృద్ధిని గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.
కొమురవెల్లిలో సదుపాయాలు కల్పించడంతో పాటు క్యూ కాంప్లెక్స్ నిర్మిస్తామని, ఆలయంలో సిబ్బంది కొరత లేకుండా చూస్తామని చెప్పారు. కొమురవెల్లిలో మాస్టర్ ప్లాన్ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఆమె వెంట ఆలయ చైర్మన్ గంగం నరసింహారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహాదేవుని శ్రీనివాస్, ఆలయ ప్రధాన అర్చకులు మహదేవుని మల్లికార్జున్, ఈవో కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.