South India's No.1 Digital Mobile Paper
LIVE
Welcome to Smacy Media

ఇరాన్‌ దాడుల భయం.. అమెరికా ఇంధన విమానాల తరలింపు!

ఇరాన్‌ దాడుల భయం.. అమెరికా ఇంధన విమానాల తరలింపు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు ఇంకా చల్లారలేదు. ఈ క్రమంలోనే ఇరాన్‌ దాడుల భయంతో అమెరికా కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇంగ్లాండ్‌ వైమానిక స్థావరంలో నిలిపి ఉంచిన తమ రెండు గగనతల ఇంధన సరఫరా విమానాలను సోమవారం జర్మనీకి తరలించినట్లు ‘ది వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’ ఓ కథనంలో పేర్కొంది. అదే రోజు మరికొన్ని ఇంధన విమానాలనూ ఐరోపాలోని ఇతర స్థావరాలకు తరలించినట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ తెలిపింది. ఇరాన్‌ నుంచి కొత్త ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు రావడంతో అమెరికా ఈమేరకు చర్యలు తీసుకుందని వెల్లడించింది.

యుద్ధం మొదలుపెడదామా..?: ట్రంప్‌నకు రోజూ నెతన్యాహు ఫోన్‌కాల్‌

ఇంధన విమానాల తరలింపు వ్యవహారంపై తమకు సమాచారం ఉందని ఓ యూరోపియన్ కమాండ్ అధికారి తెలిపారు. ‘‘మిత్రదేశాలు, భాగస్వాములతో కుదిరిన ఒప్పందాలకు అనుగుణంగా ఆ విమానాలను ఇక్కడ మోహరించారు. అయితే.. శిక్షణ కార్యకలాపాలు, క్షేత్రస్థాయి అవసరాల వంటి కారణాలతో వాటిని వివిధ ప్రాంతాలకు తరలిస్తుంటారు’’ అని చెప్పారు. అమెరికా వైమానిక దళం నిర్వహణలోని ‘ఆర్‌ఏఎఫ్ మిల్డెన్‌హాల్’ స్థావరం.. ఐరోపా ప్రాంతంలో ఆ దేశానికి ఉన్న ఏకైక శాశ్వత ఇంధన సరఫరా కేంద్రం. 37 టన్నులకుపైగా సరకులను మోయగల కేసీ-135 స్ట్రాటోట్యాంకర్‌లను ఇక్కడ అందుబాటులో ఉంచింది.

📍 East Godavari
📰 Eenadu Telugu
🕒 11 days ago

Related News

మలివిడత పుర పోరు .. మేయర్‌, ఛైర్మన్‌ స్థానాలకు కూటమి అభ్యర్థులు వీరే
మలివిడత పుర పోరు .. మేయర్‌, ఛైర్మన్‌ స్థానాలకు కూటమి అభ్యర్థులు వీరే
వ్యోమనౌకను గాల్లోనే ఒడిసిపట్టి
వ్యోమనౌకను గాల్లోనే ఒడిసిపట్టి
కోస్తాంధ్రకు తరచూ తుపాన్ల ముప్పు.. శాశ్వత పరిష్కారం చూపాలి: చంద్రబాబు
కోస్తాంధ్రకు తరచూ తుపాన్ల ముప్పు.. శాశ్వత పరిష్కారం చూపాలి: చంద్రబాబు
⬅ Back
➕ Post Ad
To Ads ➡